అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ అభివృద్దికి సంబంధించి నాలుగు నెలల్లోగా మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తామన్నారు మంత్రి నారాయణ…రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని వైజాగ్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో స్వార్ధం కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారని..మళ్లీ మార్పులు చేసి ప్రజాభిప్రాయంతో ఫైనల్ ప్లాన్ విడుదల చేస్తామని తెలిపారు. విశాఖపట్నం నగర అభివృద్దితో పాటు సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై జీవీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ సమీక్ష చేసారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు …
Read More »Daily Archives: March 21, 2025
జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్‌డీవోలకు శిక్షణ సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ గవర్నర్‌పేట, రైతు శిక్షణ కేంద్రం సమావేశ మందిరంలో శుక్రవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం ఆధ్వర్యంలో రెవెన్యూ సేవల పంపిణీపై అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్‌డీవోలకు శిక్షణ సదస్సు జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, సీసీఎల్ఏ జి.జయలక్ష్మి పాల్గొని.. నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు అందించడంతోపాటు ఏవైనా …
Read More »రాష్ట్రానికి 1736 క్వింటాళ్ల బ్రీడర్ విత్తనాల సరఫరాకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం
-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ -ముగిసిన రెండు రోజుల జోనల్ విత్తన సమీక్ష సదస్సు -నాణ్యమైన విత్తనాలను రైతులే ఉత్పత్తి చేసుకునేలా 7 పంటలలో బ్రీడర్ విత్తనాల సరఫరాకు అనుమతి -5 సంవత్సరాల లోపు పరిశోధన స్థానముల నుండి విడుదలైన అపరాల బ్రీడర్ విత్తనాలను రాయితీ పై సరఫరాకు చేర్చిన కేంద్ర ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విత్తన విభాగం వారి ఆధ్వర్యములో జాతీయ స్థాయిలో,మన దేశంలోని అన్ని రాష్ట్రాల …
Read More »రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ
-100 బృందాలతో తనిఖీలు -మందుల షాపులు, మందుల ఏజెన్సీలపై దాడులు -రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశానుసారం.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిర్ధేశానుసారం ఈగల్ టీమ్ ఐజీ మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్, స్థానిక పోలీసు లు, డ్రగ్స్ డిపార్ట్ మెంట్ ల ఆధ్వర్యంలో టీమ్ గా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపై మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీల పై దాడులు నిర్వహించామని ఈగల్ (ఎలైట్ యాంటీ-నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ …
Read More »రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటలను ప్రారంభించనున్న ఉప ముఖ్య మంత్రి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహత్మ గాంధీ ఉపాది హామీ పధకంలో భాగంగా ది :22.03.2025 న ప్రపంచ జల దినోత్సవం పురస్కరించుని రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటలను ఉప ముఖ్య మంత్రి ప్రారంభించుచున్నారు. ఎన్. టి. ఆర్ జిల్లాలో మార్చి, ఏప్రిల్, మే మరియు జూన్ నెల లో 3000 పంట కుంటలను లక్ష్యంగా నిర్దారించుకోవడం జరిగినది . రేపు అనగా ది :22.03.2025 న అన్నీ మండలాలలోని అన్నీ గ్రామ పంచాయతీలో పంట కుంటలను రేపు పనులు …
Read More »మన రాష్ట్రం నుండి 1630 మంది హజ్ యాత్రికులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2025 సంవత్సరం లో హజ్ యాత్ర చేయుటకు మన రాష్ట్రం నుండి 1630 మంది యాత్రికులను హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారు ఎంపిక చేయడం జరిగింది. ఇందులో, యాత్రికులు, తమ వ్యక్తిగత కోరికపై వివిధ విమానాశ్రాయాల ద్వారా ప్రయాణం చేయుటకు ఆన్ లైన్ లో తమ దరఖాస్తు నమోదు చేయుటకు రెండు అప్షన్ లు ఇవ్వడమైనది. అప్షన్ ల వారీగా, వివిధ ఎంబార్ కేషన్ పాయింట్ల నుండి బయలుదేరు యాత్రికుల వివరాలు క్రింది విధంగా వున్నవి. …
Read More »సమీకృత పంట కుంటల ప్రాధాన్యాన్ని చాటిచెప్పండి
– వర్షాకాలం నాటికి కుంటలు ఏర్పాటు చేసుకునేలా రైతులను ప్రోత్సహించండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొలాల్లో సమీకృత నీటికుంటలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని, వర్షాకాలం నాటికి కుంటలు ఏర్పాటుచేసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గౌరవ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉపాధి హామీ …
Read More »సజావుగా పదో తరగతి పరీక్షలు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగుతున్నాయని, పొరపాట్లకు తావులేకుండా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ.. విజయవాడ సూర్యారావుపేటలోని కర్నాటి రామ్మోహన్‌రావు మునిసిపల్ ఉన్నతపాఠశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా విద్యార్థులు పరీక్ష రాసేందుకు పాఠశాలలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీటికి , ఇతర వసతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. …
Read More »ఈ నెల 22న సత్తెనపల్లి పోస్ట్ ఆఫీస్ నూతన భవన శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సత్తెనపల్లి పోస్ట్ ఆఫీస్ నూతన భవన నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం శనివారం (22.03.2025) మధ్యాహ్నం 12:00 గంటలకు జరుగును. సత్తెనపల్లి పోస్ట్ ఆఫీస్ నూతన భవన నిర్మాణం కోసం శంకుస్థాపన శనివారం (22.03.2025) మధ్యాహ్నం 12:00 గంటలకు కేంద్ర కమ్యూనికేషన్స్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ చేయుదురు అని తదుపరి వేంకటేశ్వర గ్రాండ్, అయ్యప్పస్వామి గుడి దగ్గర, ఆర్.టి.సి. బస్టాండ్ సమీపం, సత్తెనపల్లి నందు సమావేశం జరుగుతుంది అని …
Read More »వినాయక ఆలయం కూల్చివేత దారుణం
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేవీనగర్ లో నిర్మాణంలో ఉన్న వినాయక ఆలయాన్ని వీఎంసీ అధికారులు కూల్చివేయటం దారుణమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జీవీఆర్ నగర్ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణంలో అధికారులు జేసీబీలతో కూల్చివేసిన ఆలయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆలయాన్ని కూల్చివేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుసరించాల్సిన నిబంధనలను పాటించకుండా అత్యుత్సాహంతో అధికారులు ఆలయాన్ని కూలగొట్టడం …
Read More »
Prajavartha Online Telugu News