రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయం ద్వారా వర్క్ ఫ్రం హోమ్, ఈ కేవైసి, మిస్సింగ్ సిటిజన్, మిస్సింగ్ ఎంప్లాయీస్ కి చెందిన సర్వే వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమమవారం సాయంత్రం జి ఎస్ డబ్ల్యూ ఎస్ ముఖ్య కార్యదర్శి కాటంనేని భాస్కర్ గ్రామ వార్డు సచివాలయం ద్వారా చేపడుతున్న సర్వేపై, సచివాలయాల హేతుబద్ధీకరణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, …
Read More »Daily Archives: April 7, 2025
డెలివరీ బాయ్స్ గా పనిచేసే అసంఘటిత రంగంలో పనిచేసే ప్లాట్ ఫామ్ వర్కర్స్ / ఉద్యోగులకి కార్మిక శాఖ చే గుర్తింపు కార్డులు జారీ
-ఈ శ్రమ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకోవాలి -ఏప్రియల్ 7 నుంచి 17 వ తేదీ వరకు ప్రత్యేక నమోదు డ్రైవ్ -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డెలివరీ రంగంలో పనిచేసే ఉద్యోగులు / కార్మికులు ఉచితంగా పేరు నమోదు చేసుకొని కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసే గుర్తింపు కార్డు పొందడం ద్వారా సంక్షేమ పధకాలు పొందవచ్చు అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. అమెజాన్, జొమాటో, స్విగ్గీ, …
Read More »దత్తత తీసుకున్న చిన్నారి ఆదిత్య పోషణ, సంరక్షణకు బాధ్యత వహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దత్తత తీసుకున్న చిన్నారి ఆదిత్య పోషణ, సంరక్షణకు బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోరారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో హైదరాబాద్కు చెందిన పి అజయ్ కుమార్, శ్వేతా నిగమ్ ల కు మచిలీపట్నం నగరంలోని శిశు గృహలో ఉన్నటువంటి సంవత్సరం వయసు గల ఆదిత్య అనే బాలుడిని అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిన్నారి బాలుడిని దత్తత తీసుకున్నందుకు దంపతులిద్దరిని అభినందించారు. ఇకపై …
Read More »అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, ఆర్ డి ఓ స్వాతి, మెప్మా పిడి సాయిబాబా లతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)- మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా …
Read More »రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే లాప్టాప్ లను సద్వినియోగం చేసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే లాప్టాప్ లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దివ్యాంగులను కోరారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో వృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 5 మంది దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా లాప్టాప్ లు పంపిణీ చేశారు. లాప్టాప్ లు పొందిన వారిలో కనుపర్తిపూడి రోహిత్, కాగిత విష్ణు సాయి, సింధు నాగబాబు, నోతక్కి కృష్ణకుమారి, జరుగు సుమతి ఉన్నారు. ఈ సందర్భంగా …
Read More »ఇంటి పన్ను ఖాళీ స్థలాల పనులు చెల్లించండి ఐదు శాతం రిబేట్ పొందండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2025-2026 సంవత్సరమునకు ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లించి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఐదు శాతం రాయితీని పొందవచ్చు అని తెలిపారు డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ 2025-2026 సంవత్సరంకుగాను ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను పై ఐదు శాతం రాయితీ కల్పించిన సందర్భంగా, నగర ప్రజల సౌకర్యార్థం నగర పరిధిలో గల క్యాష్ కౌంటర్లే …
Read More »నగరంలో విస్తృతంగా డీసిల్టింగ్ పనులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నగరంలో డీసెల్టింగ్ పనులను విస్తృతంగా చేపట్టి, వర్షం పడిన వర్షపు నీటి నిలువలు రోడ్డుపైన ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించగా నగరంలో విస్తృతంగా డీసిల్టింగ్ పనులు అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ, కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో డీసిల్టింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వర్షాలు పడిన రోడ్డుపైన వర్షపు నీటి నిల్వలు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. …
Read More »వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలి
-డీఏ వెనక్కి తీసుకోవడం దారుణం -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రౌండ్‌టేబుల్ సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారికి పదోన్నతులు ఇవ్వాలని, వేతనాలను పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్‌ఏల సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లతానని భరోసా ఇచ్చారు. విజయవాడ దాసరిభవన్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర సమితి అధ్వర్యంలో సంఘం రాష్ట్ర …
Read More »సిపిఐ శత వసంతాల పాటల వీడియో విడుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ శత వసంతాల వేడుకల సందర్భంగా పాటల వీడియోను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఈ రోజు విడుదల చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శత వసంతాల వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రూపొందించిన పాటల వీడియోను సోమవారం విజయవాడ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో రామకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 100 సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో అనేక వీరోచిత పోరాటాలు, త్యాగాలు చేసిందన్నారు. ముఖ్యంగా అణగారిన ప్రజల …
Read More »నర్సింగ్ విద్యాసంస్థల ఏర్పాటు, నిర్వహణను ప్రక్షాళన చేయాలి
-నూతన హెచ్.పి.సి చైర్మన్ కు మంత్రి శ్రీసత్యకుమార్ యాదవ్ సూచన -అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు మరియు వాటి నిర్వహణను నియమాలకనుగుణంగా పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆరోగ్య శాఖామంత్రి శ్రీసత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ విషయాలను పర్యవేక్షించే హైపవర్ కమిటీ కొత్త చైర్మన్, మాజీ హైకోర్టు జడ్జి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావుకు మంత్రి ఈ మేరకు సూచించారు. నూతన చైర్మన్ గా ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ దుర్గాప్రసాదరావు సోమవారం …
Read More »
Prajavartha Online Telugu News