Breaking News

Daily Archives: April 7, 2025

నవీన స్కూల్లో దరఖాస్తుల పరిశీలన క్యాంప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ స్వయం ఉపాధి పధకాలకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న 1153 మందిలో సోమవారం అమరావతి రోడ్ లోని నవీన స్కూల్లో దరఖాస్తుల పరిశీలన క్యాంప్ కి 552 మంది హాజరయ్యారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు తెలిపారు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఉపా సెల్ పిఓ రామారావు సోమవారం నవీన స్కూల్లో ప్రత్తిపాడు నియోజకవర్గ రుణమేళా క్యాంప్ నిర్వహించారు. ఈ …

Read More »

ఈ నెల 30 లోపు ఏక మొత్తంలో ఆస్తి పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి 2 అర్ధ సంవత్సరాల మొత్తం ఆస్తి పన్నును ఏక మొత్తంగా ఏప్రిల్ నెలాఖరులోపు చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని, సోమవారం నుండి ఈఆర్పీ సర్వర్ అందుబాటులోకి వచ్చినందున నగరంలోని పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేస్కోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్నుదారులకు రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

ప్రజలు ఇస్తున్న ఆర్జీల్లోని ఫిర్యదులకు సత్వర చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీల్లోని ఫిర్యదులకు సంబంధించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ డి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు సోమవారం కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ బర్త్ అండ్ డెత్ విభాగం వద్ద పిజిఆర్ఎస్ …

Read More »

అన్నక్యాంటీన్లలో ప్రతి రోజు నిర్దేశిత సమయంలో ఆహారం అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో ప్రతి రోజు నిర్దేశిత సమయంలో ఆహారం అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అక్షయ పాత్ర సిబ్బందికి స్పష్టం చేశారు. సోమవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశిత సమయాన్ని అన్న క్యాంటీన్లలో పాటించాలన్నారు. ప్రతి రోజు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ పెంచుకోవాలని, ఏ ఒక్కరికీ ఆహారం …

Read More »

వార్డ్ సచివాలయం కేంద్రంగా పారిశుధ్య పనులు జరగాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయం కేంద్రంగా పారిశుధ్య పనులు జరగాలని, శానిటేషన్ కార్యదర్శి సచివాలయం పరిధిలో నూరు శాతం పారిశుధ్య పనులకు భాద్యత వహించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ గారు ఏటి అగ్రహారం, నల్లకుంట, ఎన్జీఓ కాలనీ, నగరాలు, గోరంట్ల తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని …

Read More »

ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలి

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అకాల వర్షం రైతులను కోలుకోలేని దెబ్బ తీసిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కుందావారి కండ్రికలో కల్లాలు, రహదారులపై నిల్వ ఉంచిన ధాన్యాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతన్నలకు.. తడిచిన ధాన్యం ఆరబెట్టేందుకు అవుతున్న ఖర్చు తడిచి మోపెడవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో …

Read More »

గాయత్రీ సొసైటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా సామూహిక ఉపనయనాలు

-పేద బ్రాహ్మణులకు చేయూతనందించడంలో గాయత్రీ సొసైటీ పాత్ర అభినందనీయం -వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సత్యనారాయణపురంలోని శ్రీ గాయత్రి కళ్యాణ మండపం నందు బ్రాహ్మణ బాలురకు సామూహిక ఉపనయనాల కార్యక్రమం శ్రీ గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు, ధార్మిక విద్యాధికుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేసి వటువులకు దివ్య ఆశీస్సులు అందజేశారు. భిక్షాటన, యజ్ఞోపవీతం ధరించిన అనంతరం …

Read More »

ఎన్డీఏ కార్యాలయంలో రూ 5 లక్షల ఎల్ఓసి పత్రం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం హెచ్ బీ కాలనీలో నివాసముండే పతంగి ఝాన్సీ కొంతకాలంగా కిడ్నీ మరియు ఊపిరితిత్తుల వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మరింత మెరుగైన వైద్యం చేయాలని వైద్యులు సూచించారు. చికిత్సకు అయ్యే డబ్బు వారి వద్ద లేకపోవడంతో టిడిపి మాజీ కార్పొరేటర్ గుండారపు హరిబాబును సంప్రదించారు. ఆయన భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు. ఈ మేరకు సోమవారం మంజూరైన రూ 5 …

Read More »

టీచరమ్మకు ఉపాధి కల్పించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇస్లాంపేట మౌలానా ఆజాద్ హైస్కూల్ లోని టీచర్ షేక్ నూర్జహాన్ కు సుజనా ఫౌండేషన్ ప్రతినెల పదివేల రూపాయల జీతం అందిస్తున్నారు. గతంలో బాపనయ్య స్కూల్లో పనిచేసి అనివార్య కారణాల వలన ఉపాధి కోల్పోయిన టీచర్ నూర్జహాన్ జీవనోపాధి కష్టం అవుతుండటంతో డీఎస్సీ అర్హత ఉన్న తనకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరిని కోరారు. మౌలానా ఆజాద్ హైస్కూల్ లో ఉర్దూ మీడియం విద్యార్థులకు సేవలందించాలని సుజనా చౌదరి సూచించడంతో పాఠశాలలో ఉర్దూ టీచర్ గా …

Read More »

సీతారామ సేవా సమాజం ఆధ్వర్యంలో అన్నదానం

-పాల్గొన్న ఎన్ టీ ఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ -ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అల్లూరి సీతారామరాజు కల్చరల్ ఆర్గనైజేషన్, సీతారామ సేవా సమాజం ఆధ్వర్యంలో విద్యాధరపురం చెరువు సెంటర్ ప్రాంతంలో సోమవారం శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని సీతారామ సేవా సమాజం ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో …

Read More »