Breaking News

Monthly Archives: April 2026

తీవ్రవడగాల్పులు వీచే అవకాశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం (21-04-26) 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 29 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం 54 తీవ్ర, 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే మండలాలు(46) శ్రీకాకుళం జిల్లా : ఆమదాలవలస,బూర్జ, హిరమండలం, జలుమూరు, కంచిలి, లక్ష్మీనర్సుపేట, …

Read More »

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్ర‌గ‌తికి కీల‌కం

-నూత‌న జ‌నాభా నిర్వ‌హ‌ణ విధానంలో స‌మ‌గ్ర కార్యాచ‌రణ ప్ర‌తిపాద‌న‌ -నైపుణ్యావ‌స‌రాల గుర్తింపు, ల‌భ్య‌త‌లో వ్య‌త్యాసాల నిర్మూల‌న ల‌క్ష్యం -95 శాతం ప్ర‌జ‌లకు డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త -పారిశ్రామిక అవ‌స‌రాలకు అనుగుణంగా నైపుణ్య శిక్ష‌ణ‌ -అవ‌కాశాలను వినియోగించుకోవాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సంతానోత్ప‌త్తి పెంపున‌కు ఆటంకంగా ఉన్న ఆర్థికప‌ర‌మైన స‌మ‌స్య‌ల్ని ప‌రిష్కరించే దిశ‌గా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఉత్పాద‌క సామ‌ర్ధ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం విస్తృత నైపుణ్య వికాస ప్ర‌ణాళిక‌ను రూపొందించింద‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ …

Read More »

ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ..అర్జీలు స్వీకరించిన APCRDA కమిషనర్ వి.విజయరామరాజు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్, నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ(NSP), రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను కమిషనర్ వి.విజయరామరాజు IASకి అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని కమిషనర్, అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ IAS అర్జీదారులకు తెలియజేశారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో సిటిజన్ …

Read More »

అమరావతి ప్రాంత యువతకు ఈ నెల 25న జాబ్ మేళా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి ప్రాంత యువత, నిరుద్యోగులకు విస్తృతంగా ఉపాధి కల్పించాలనే సదుద్దేశ్యంతో మంత్రి డా.పొంగూరు నారాయణ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC), CRDA సోషల్ డెవలప్మెంట్ అధికారుల సౌజన్యంతో అమరావతిలో జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతోంది. APSSDC సమన్వయంతో అమరావతి, తుళ్లూరులోని స్కిల్ హబ్ కార్యాలయంలో APCRDA అధికారులు జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం …

Read More »

కొండపల్లి బొమ్మలకు విశ్వవ్యాప్త గుర్తింపు తెస్తాం: పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-మూడు రోజుల పాటు కనువిందు చేసిన ‘కొండపల్లి బొమ్మల పండుగ-2026’ ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి దుర్గేష్ -కొండపల్లిని అంతర్జాతీయ స్థాయి ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్’గా తీర్చిదిద్దుతామని ప్రకటన -ప్రతి ఏటా ఏప్రిల్ 18 నుండి 20 వరకు అధికారికంగా ఉత్సవాల నిర్వహిస్తామని వెల్లడి -కొండపల్లి సమీప పర్యాటక ప్రాంతాలు కలిపి పర్యాటక సర్క్యూట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం. -వారసత్వ కళాసృష్టి ‘కొండపల్లి బొమ్మ’.. భావితరాలకు ఈ కళను అందిస్తాం: మంత్రి దుర్గేష్ -సహజత్వానికి నిలువుటద్దం కొండపల్లి బొమ్మలు.. ముగింపు వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ …

Read More »

అద‌ర‌హో.. కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల పండ‌గ‌..

– విజ‌య‌వంతంగా ముగిసిన మూడు రోజుల ఉత్సవాలు – కొండ‌ప‌ల్లి బొమ్మ‌కు, కొండ‌ప‌ల్లి క‌ళాకారుల‌కు కొత్త ఉత్తేజం – చివ‌రి రోజు కార్య‌క్ర‌మాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ – రాష్ట్ర స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ సంచాల‌కులు కేఎస్ విశ్వ‌నాథ‌న్‌ – ఆద్యంతం క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించిన మైల‌వ‌రం శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌. ఏపీ నాట‌క అకాడమీ ఛైర్మ‌న్ గుమ్మ‌డి గోపాల‌కృష్ణ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌పంచ వార‌స‌త్వ దినోత్స‌వం …

Read More »

ఆంధ్రుల ఆత్మగౌరవ శిఖరం సీఎం చంద్రబాబు… : మోటూరి శంకర్‌రావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు కి ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మోటూరి శంకర్‌రావు మాట్లాడుతూ… ​తెలుగు రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన ధీశాలి, ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, తన మేధస్సుతో మరియు కఠోర శ్రమతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన ప్రయాణం ఒక అద్భుత …

Read More »

గన్నవరంలో ఘనంగా సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు

-ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు -తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ -మర్లపాలెంలో రూ.74 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు గన్నవరం నియోజకవర్గం మర్లపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం …

Read More »

బ్రిడ్జ్ కోర్స్ చాలా పాఠశాలల్లో జరగనే లేదు…

-మళ్లీ దానికి గ్రాండ్ టెస్ట్ నిర్వహణ మరియు నమోదు కూడానా….? విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయులు పదవ తరగతి పరీక్షలు ఒకవైపు జరుపుతూ మరొకవైపు మూల్యాంకన విధులలో పాల్గొన్న దృష్ట్యా చాలా పాఠశాలల్లో బ్రిడ్జి కోర్స్ జరగనే లేదు.మళ్లీ ఆ కోర్సు కు గ్రాండ్ టెస్టులు పెట్టమనడం ఫలితము లేని నిర్వహణ అని విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకొని ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్.టి.యు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్.సాయి శ్రీనివాస్ కోరారు. బ్రిడ్జ్ కోర్స్ పుస్తకాలు …

Read More »

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో MSMEలకు తక్షణ మద్దతు ఇవ్వాలని కోరిన ఏపీ ఛాంబర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME)పై పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల తీవ్ర ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అత్యవసరంగా తీసుకువెళ్లింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో దాదాపు 90% వాటా కలిగిన ఎంఎస్‌ఎంఈలు అమ్మకాలు తగ్గడం మరియు ఎగుమతులు క్షీణించడం వల్ల తీవ్ర అంతరాయాలను ఎదుర్కొంటున్నాయని ఏపీ ఛాంబర్స్ పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు (సీఫుడ్), మామిడి గుజ్జు, …

Read More »