Breaking News

Monthly Archives: July 2026

ఈ నెల 31న విజ‌య‌వాడ తూర్పులో ప్రత్యేక గ్రీవెన్స్

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 31వ తేదీ శుక్ర‌వారం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరుగుతుంద‌ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం ప‌ట‌మ‌ట ఎన్ఎస్ఎం ప‌బ్లిక్ స్కూల్ స‌మీపంలోని న‌ళ్లూరివారి క‌ళ్యాణ మండపంలో జ‌రుగుతుంద‌న్నారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో విజ‌య‌వాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని స్థానిక ప్ర‌జ‌ల నుంచి అధికారులు అర్జీలను ఉదయం 10 …

Read More »

మహిళల, పిల్లల అక్రమ రవాణా నిరోధానికి ప్రతి ఒక్కరిలో అవగాహన, అప్రమత్తత పెరగాలి

-మహిళల, పిల్లల అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనకు సమష్టి కృషి అవసరం -ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు, చిన్నారుల అక్రమ రవాణాను సమూలంగా అరికట్టాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరిలో అవగాహన, అప్రమత్తత పెరగడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం విజయవాడ కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా …

Read More »

బిజెపి ఎంపీ కంగనా రనౌత్‌ను అరెస్టు చేయాలి

-విద్యార్థుల ఉద్యమంపై విష ప్రచారం ఆపాలి -అసత్య ప్రచారం చేస్తున్న యÖట్యూబర్లపై కేసులు పెట్టాలి -బిజెపిలోని 39 శాతం క్రిమినల్ ఎంపీలపై చర్యలేవీ? -ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి, -నీట్ బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి -రాష్ట్రంలో కరువు విలయతాండవం -56 శాతం లోటు వర్షపాతంతో రైతుల్లో ఆందోళన -రాష్ట్రంలో కరువు, వర్షాభావ ప్రాంతాల్లో సిపిఐ పర్యటన, ఆందోళన -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా సాగిన విద్యార్థి, …

Read More »

విద్యార్థి నాయకుల పై అక్రమ కేసులు దుర్మార్గం

-చంద్రబాబు ఈవెంట్ మేనేజర్ గా మారటం తగదు. -సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఉద్యమ నేతలపై అక్రమ కేసులు బనాయించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సిద్ధపడటం దుర్మార్గమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా దుయ్యబట్టారు. గ్రాఫ్ పడిపోయిన మోడీ అడుగులకు మడుగులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవెంట్ మేనేజర్ గా మారటం తగదని హితవు పలికారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. …

Read More »

విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యం

-కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌పై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ -సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఐ.ఏ.ఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల కెరీర్ ప్రణాళిక, మానసిక ఆరోగ్యం, సమగ్రాభివృద్ధిని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ లో భాగంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ), సైకోమెట్రిక్ టూల్ ప్రమాణీకరణపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ ను గురువారం విజయవాడలోని వైఈఎస్-జే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు …

Read More »

ప్రజారోగ్యం సిబ్బందికి ప్రత్యేక సామర్థ్య వృద్ధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించడం, నైపుణ్యాలను మెరుగుపరచడం మరియు సురక్షితమైన పనివాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో, నాలెడ్జ్ పార్ట్నర్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (AIILSG) సహకారంతో ప్రత్యేక సామర్థ్య వృద్ధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద గల హోటల్ పార్క్ ఎన్ లో శానిటేరీ సెక్రెటరీస్ కి, ఆశా ఫంక్షన్ హాల్, పటమట, మరియు కృష్ణ డిస్ట్రిక్ట్ రైస్ …

Read More »

సఫాయి అప్నావో – బీమారీ భగావో కార్యక్రమం లో భాగంగా కాలువలో పూడికల తొలగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్ఠం చేసి ప్రజారోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం, స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 ఆధ్వర్యంలో చేపట్టిన “సఫాయి అప్నావో – బీమారీ భగావో (SABB)” ప్రత్యేక కార్యక్రమం ద్వారా స్వచ్ఛతపై ప్రజల్లో చైతన్యం కల్పించామని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీస్ డాక్టర్ గోపాల నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం హెచ్ బి కాలనీ, భవానిపురం ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో కాలువల …

Read More »

కంపాక్టర్ బిన్లను క్రమం తప్పకుండా పరిశుభ్రపరచండి

-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు గురువారం ఉదయం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కృష్ణలంక, రాణి గారి తోట ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని కంపాక్టర్ బిన్లను క్రమం తప్పకుండా పరిశుభ్రపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బిన్లలో నిల్వ ఉన్న చెత్తను సకాలంలో తరలించడంతో పాటు, బిన్ల లోపల, బయట పూర్తిగా శుభ్రం చేసి …

Read More »

ప్రపంచంపై ఎలక్ట్రానిక్స్ ప్రభావం అపారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్ట్రానిక్ పరికరాలు సమాజగతిని మారుస్తున్నాయని, రాబోయే రోజుల్లో మన బట్టలే మొబైల్ చార్జింగ్ చేస్తాయని, క్షణాల్లో సుగర్ లెవెల్స్ మన కళ్ళముందే కనబడతాయని కె.ఎల్. డీమ్డ్ వర్సిటీ డీన్ డాక్టర్ బి.టి.పి. మాధవ్ అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎలక్ట్రానిక్స్ విభాగం  ఫ్లెక్సిబుల్ అండ్ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్స్ పై  ఎ.ఐ. టూల్స్ ప్రభావం గురించి గురువారం వెబినార్ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్నాప్ మేజిక్ లాంటి ఏఐ కోపైలట్ టూల్స్ …

Read More »

అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలకు సమాధానం చెప్పాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, సామాన్య మానవుడు సమాజంలో బ్రతకగలిగే అవకాశం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర SEC మెంబర్ జాన్ కెనడి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టిడిపి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నుండి విజయవాడ టిడిపి ఎస్సీ సెల్ సోంగా సంజయ్ వర్మ వరకు మహిళలపై లైంగిక దాడులకు …

Read More »