విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం (World Day Against Trafficking in Persons)30.7.2026 సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి. ఎస్. సూచనల మేరకు ఎన్‌టీఆర్ పోలీస్ కమిషనరేట్, నిర్మలా హై స్కూల్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, విజయవాడ, మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ, సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని నిర్మల హై స్కూల్ నందు విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం …
Read More »Monthly Archives: July 2026
గన్నవరం అభివృద్ధిని విస్మరించి ప్రతికూల ప్రచారం చేయడం బాధాకరం: యార్లగడ్డ
-గన్నవరం అంటే అంతర్జాతీయ విమానాశ్రయం, హెచ్‌సీఎల్, ఉపాధి అవకాశాలకు కేంద్రం: ఎమ్మెల్యే -రెండేళ్లలో గన్నవరం టౌన్‌లో రూ.89 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం: యార్లగడ్డ -విజయవాడ రూరల్ 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయాల్సిందే: ఎమ్మెల్యే -9 గ్రామాల తాగునీరు, చెత్త సమస్యలకు వీఎంసీ విలీనమే శాశ్వత పరిష్కారం -9 గ్రామాల వీఎంసీ విలీనం కోసం సీఎం చంద్రబాబును మరోసారి కలుస్తా: యార్లగడ్డ -గత 30 రోజుల్లో గన్నవరం నియోజకవర్గానికి దాదాపు రూ.100 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు అయ్యాయి -గన్నవరాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికి …
Read More »చరిత్ర సృష్టించే వేడుకకు గరివిడి నుంచి భారీ స్పందన
-భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ విజయానికి పార్టీ శ్రేణుల సమన్వయంపై కళా, దేవినేని సమీక్ష -రెండేళ్ల కూటమి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం గరివిడి, నేటి పత్రిక ప్రజావార్త : భోగాపురంలో ఆగస్టు 1న జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మక విజయంగా నిలపాలని టిడిపి నేతలు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి మండలం శేరిపేట గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో మాజీ మంత్రి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావుతో కలిసి తెలుగుదేశం పార్టీ …
Read More »మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ కూటమి నేతలతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. 48 వ డివిజన్, చిట్టి నగర్ కు చెందిన అక్కిశెట్టి మురళి …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ,ఎన్డీయే కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, కూటమి నేతలతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పింఛన్లు , ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం,ప్రభుత్వ పథకాలు,ఇతర స్థానిక సమస్యలకు సంబంధించిన అంశాలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ ముఖ్య లక్షమన్నారు. …
Read More »విజయవాడ , పశ్చిమలో బీజేపీ సంస్థాగత సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ జనతా పార్టీ సంస్థాగత సమావేశం గురువారం భవానిపురం, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డులోని యస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఇన్చార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఇన్చార్జ్ నార్ని తాతాజీ , పశ్చిమ నియోజకవర్గ సర్ ప్రోగ్రాం కన్వీనర్ పచ్చిపులుసు …
Read More »ఆదర్శ గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
-పీఎంఏజీవై కింద మంజూరైన నిధులను సత్వరమే వినియోగించి పనులు పూర్తి చేయాలి -ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన (PMAGY) పథకం కింద ఎంపికైన ఆదర్శ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, మంజూరైన నిధులను సమర్థవంతంగా వినియోగించి నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం …
Read More »పచ్చని వరి నాట్లతో పసిడి పండాలి..
– పొలం బాట పట్టి అన్నదాతలతో మాట కలిపిన కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం తిరువూరు మండలంలో పర్యటించారు. ఎరువులు, పురుగుమందుల దుకాణంతో పాటు బోర్డర్ చెక్ పోస్టును తనిఖీ చేసిన అనంతరం పంట పొలాల బాటపట్టారు. వామకుంట్ల గ్రామంలోని వరి నాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో ఆత్మీయంగా మాట్లాడారు. రైతుల నుంచి సాగు పరిస్థితులు, ప్రభుత్వ సేవలపై అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ సాగు …
Read More »సమృద్ధిగా ఎరువులు.. సజావుగా సరఫరా
– ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా పారదర్శకంగా పంపిణీ – జిల్లాలో అందుబాటులో 8,185 మెట్రిక్ టన్నుల యూరియా – క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు – ఏ సమస్య ఉన్నా కాల్ టు కలెక్టర్ 91549 70454 – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు ఎలాంటి కొరత లేకుండా సకాలంలో అందేలా జిల్లా యంత్రాంగం పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతోందని.. అన్నదాత అవసరాలకు అనుగుణంగా పారదర్శక విధానంతో ఎరువులను …
Read More »సూపర్ ఎల్‌నినో పరిస్థితులను తెలివిగా అధిగమించాలి
-తాగునీటికే తొలి ప్రాధాన్యత – వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలి -ప్రతి పంటకు పీఎం ఫసల్ బీమా యోజనలో తప్పనిసరిగా నమోదు కావాలి -జిల్లా కలెక్టర్, సాగునీటి సలహా మండలి చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్, సాగునీటి సలహా మండలి చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన గురువారం విజయవాడ కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు 5వ సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఖరీఫ్–2026 సీజన్‌లో సూపర్ ఎల్‌నినో …
Read More »
Prajavartha Online Telugu News