Breaking News

చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం

-తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రగిరి ఇంటిగ్రేటెడ్ బాలిక హాస్టల్ విద్యార్థినులకు అస్వస్థతపై మంత్రి సవిత ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యమందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 27 మంది చంద్రగిరి ఇంటిగ్రేటెడ్ బాలిక హాస్టల్ విద్యార్థినులు వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో 18 బీసీ విద్యార్థినులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో మంత్రి సవిత ఫోన్ లో మాట్లాడారు. అస్వస్థతకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. హాస్టల్ లో మిగిలిన విద్యార్థినులంతా క్షేమంగా ఉన్నారని మంత్రికి కలెక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలన్న మంత్రి.. హాస్టల్ లో వైద్య శిబిరం నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారమందించాలని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ ను మంత్రి సవిత ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *