Breaking News

క్రీడాకారులకు అండ‌గా ప్ర‌భుత్వం

-శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు
-ఖోఖో ప్ర‌పంచ‌క‌ప్ విజేత పి.శివారెడ్డిని అభినందించిన శాప్ ఛైర్మ‌న్‌

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడాకారుల‌ భ‌విష్య‌త్తుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. విజ‌య‌వాడ‌లోని శాప్ కార్యాల‌యంలో శాప్ ఛైర్మ‌న్‌ను ఖోఖో ప్ర‌పంచ క‌ప్ విజేత పి.శివారెడ్డి గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా శాప్ ఛైర్మ‌న్ క్రీడాకారుడిని అభినందిస్తూ శాలువాతో స‌త్క‌రించారు. న్యూఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన ఖోఖో తొలిప్ర‌పంచ‌క‌ప్‌లో ఇండియా విజేత‌గా నిల‌వ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని, ఇండియా జ‌ట్టులో ప్ర‌కాశం జిల్లాకు చెందిన శివారెడ్డి ప్రాతినిధ్యం వ‌హించ‌డం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని, శాప్ నుంచి పూర్తి స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తామ‌ని శాప్ ఛైర్మ‌న్ హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీ ఖోఖో అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, అద్దంకి మాజీ ఎమ్మె చెంచు గ‌ర‌ట‌య్య‌, ఏపీ ఖోఖో అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి ఎమ్‌.సీతారామ్‌రెడ్డి, శేషునాధ‌రెడ్డి, కాశీవిశ్వ‌నాధ‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

శాప్ ఛైర్మ‌న్‌ను క‌లిసిన ఏపీఈఎమ్‌సిఎల్ ఛైర్మ‌న్‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ ఛైర్మ‌న్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి విజ‌య‌వాడ‌లోని శాప్ కార్యాల‌యంలో శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడిని గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా శాప్ ఛైర్మ‌న్ దినేష్ రెడ్డికి శాలువా క‌ప్పి స‌త్క‌రించారు. అనంత‌రం వారిరువురూ త‌మ డిపార్టుమెంటుల్లో చేప‌డుతున్న అభివృద్ధి కార్యక్ర‌మాల‌పై చ‌ర్చించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *