Breaking News

ఫిబ్రవరి 10, 11, 12,13 తేదీల్లో ప్రతిష్టాత్మక ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ -2025

-ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహణ
-విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) కార్యాలయం నేతృత్వంలో తొలిసారి నిర్వహిస్తోన్న సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్..
-క్రికెట్ పోటీల్లో పాల్గొననున్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్లు
-టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం
-ఉత్సాహంతో క్రీడాస్ఫూర్తిని, సమిష్టితత్వాన్ని, రాష్ట్ర ఉనికిని చాటనున్న సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 10 నుండి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ -2025 పోటీలు జరగనున్నాయి. విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) కార్యాలయం నేతృత్వంలో తొలిసారి సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించబడుతోంది. ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ లో దక్షిణాది నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్లు పాల్గొని తలపడనున్నాయి. తొలిసారిగా ఈ క్రీడలను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తోండటం గర్వించదగ్గ విషయం. ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ కు అర్హత పొందేందుకు ఈ టోర్నమెంట్ ఉపయోగపడనుందని ఆడిట్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులు జాతీయస్థాయిలో వారి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొందుతారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవం 10 ఫిబ్రవరి, 2025న ఉదయం 8 గం.లకు జరుగుతుంది. 13 ఫిబ్రవరి, 2025న మధ్యాహ్నం 1.30 గం.లకు ముగింపు వేడుకతో టోర్నమెంట్ ముగుస్తుంది..క్రీడాభిమానం ఉన్న ప్రతిఒక్కరూ సంబంధిత మ్యాచ్ లు వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *