Breaking News

వార్డ్ సచివాలయాల వారీగా పారిశుధ్య పనుల్లో మెరుగుదల ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా పారిశుధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని, డ్రైన్ల శుభ్రంపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్  తమ రోజువారీ పర్యటనలో భాగంగా రెడ్డిపాలెం, గోరంట్ల, శ్యామలా నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను, చుట్టగుంట సెంటర్ లో అన్న క్యాంటీన్ ని పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగరంలో ప్రజారోగ్య విభాగం ద్వారా నగర ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా కార్మికులుగ ఉన్న వారు సూపర్వైజర్ల పేరుతో పారిశుధ్య పనులు చేయకుండా ఉండడం గమనించి, వారిని తప్పనిసరిగా పారిశుధ్య పనులు చేయాలని ఆదేశించామన్నారు. అలాగే శానిటరీ డివిజన్ల పెంపుతో పాటు కార్మికుల రేషనలైజేషన్ చేపట్టామన్నారు. పుష్ కాట్స్, డంపర్ బిన్స్ ని అందించామన్నారు. ప్రజారోగ్య రక్షణలో పారిశుధ్య విభాగం కీలకమని పలు చర్యలు తీసుకుంటున్నా, కొన్ని ప్రాంతాల్లో మార్పు ఉండడంలేదన్నారు. ఇక నుండి టం క్షేత్ర స్థాయి పర్యటనల్లో పారిశుధ్య పనులపై ప్రజల నుండి ఫిర్యాదులు అందితే సంబందిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలుత గోరంట్ల మస్టర్ పాయింట్ ని పరిశీలించి, కార్మికుల, కార్యదర్శుల హాజరు వివరాలు, సెలవుల రిజిస్టర్ ని తనిఖీ చేశారు. శ్యామల నగర్ పార్క్ ని పరిశీలించి, పార్క్ లో వాకింగ్ ట్రాక్, గ్రీనరీ పెంపుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ఆహార పంపిణీ అనంతరం క్యాంటీన్ ని శుభ్రం చేయాలని, త్రాగునీటి సరఫరాని జాగ్రత్తగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
పర్యటనలో డిఈఈ రమేష్ బాబు, మధుసూదన్, ఆర్ఓ రవి కిరణ్ రెడ్డి, ఎస్ఎస్ లు ఆయుబ్ ఖాన్, సోమశేఖర్, టిపిఎస్ లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *