-విజయవాడ నగర పాలక సంస్థ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై విస్తృతమైన చర్యలు చేపట్టాలని విజయవాడ నగర పాలక సంస్థ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం శాఖాధిపతులతో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి సర్కిల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ బాన్ పై విస్తృతంగా అవగాహన కల్పించాలని దానికనుగుణంగా వినియోగదారులను గుర్తించి వారితో ఒక సమావేశం నిర్వహించి 120 మైక్రోన్స్ కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ వాడకని సంపూర్ణంగా నగరపాలక సంస్థ నిషేధిస్తోంది అన్న విషయాన్ని తెలపాలని అధికారులను ఆదేశించారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వలన పర్యావరణానికి కాకుండా ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుందని, కావున పర్యావరణ పరిరక్షణ మరియు నగర పౌరుల ఆరోగ్యం కొరకు సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ ను కచ్చితంగా అమలు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ జీవిజి ఎస్ వి ప్రసాద్, ఎంజాయ్ చెయ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, సూపరిండెంటింగ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ పి సత్యకుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి వెంకటనారాయణ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సిడి వోలు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News