-కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటుచేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో రైతు సేవా సంస్థ, ఎపి సమగ్ర అభివృద్ధి అధ్యయనవేదిక, రాయలసీమ సాగునీటి సాధన సమితి సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదిక వారి సహకారంతో, ప్రభుత్వం 80 వేల కోట్ల రూపాయల అంచనాతో చేపట్టదలచిన ‘గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్’ అంశంపైన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సోమవారం గాంధీనగర్‌లోని ఐలాపురం హోటల్‌నందు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం, చర్చా కార్యక్రమాన్ని నిర్వాహకులు, రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీప్రసాద్, ఎపి సమగ్ర అభివృద్ధి అధ్యయనవేదిక కన్వీనర్ తుంగా లక్ష్మీనారాయణ, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, వక్తలు మాట్లాడుతూ సమస్యలు, అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు.
బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణను సుప్రీంకోర్టు ద్వారా అడ్డుకోవడం, లేదా సమర్థులైన న్యాయవాదుల ద్వారా ట్రిబ్యునల్ ముందు సమర్థవంతంగా వాదనలు వినిపించి, బచావత్ ట్రిబుల్ తీర్పుద్వారా కృష్ణాజలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు సంక్రమించిన హక్కులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిరక్షించాలన్నారు.
గతంలో గోదావరి నదీ జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్‌ను నియమించాలని ఎపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వెంటనే విజ్ఞప్తి చేయాలి, రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై స్థలంగా అంగీకారం వచ్చినట్లు నాడు ప్రసార మాద్యమాల్లో వార్తలు కూడా వచ్చాయి. తదనంతర కాలంలో గత ప్రభుత్వం ఈ అంశాన్ని విస్మరించింది. ప్రస్తుత ప్రభుత్వం అతసత్వం ప్రదర్శించకుండా ట్రిబ్యుల్‌ను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయాలన్నారు.
విభజన జరిగి పదేళ్ళు గడిచిపోయినా కృష్ణా మిగులు జలాలపై ఆధారపడిన పెండిరగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. తెలుగు గంగ, గాలేరు-నగరి సుజల స్రవంతి, హంద్రీ-నీవా సుజల స్రవంతి, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణాలు సుమారు పదేళ్ళు గడిస్తున్నా అస్తవ్యస్తంగా కొనసాగుతున్న వాటిని పూర్తి చేయాలి. మొత్తం ప్రాజెక్టులపట్ల సమగ్ర దృక్పథంలో సహ ప్రాజెక్టుల నిర్మాణాన్ని, పంటకాలువల వ్యవస్థను, అనుసంధానం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.
హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలుగు గంగ ప్రాజెక్టులో మిగిలి వున్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి వచ్చే వార్షిక బడ్జెట్‌లో (2025`26)లో రూ. 10,000 కోట్లు కేటాయించి నిధులను విడుదల చేయాలని కోరారు.
గత ప్రభుత్వం విశాఖకు కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తరలించాలని కేంద్రానికి లేఖ రాసిందని తెలిపారు. అన్ని విధాల అనువైన కేంద్రం కర్నూలును పరిగణనలోకి తీసుకోకుండా సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పుడైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర దృక్పథం, ఆలోచించి కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటుచేయాలని కేంద్రానికి సిఫార్సు లేఖ వ్రాయాలని కోరారు. అఖిలపక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటుచేయాలన్నారు. ముఖ్యమైన ఈ 4 తీర్మానాలు అందరూ ఆమోదించి తమ మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, కె.పాపారావు రిటైర్డ్ ఇంజనీర్, కేశవరావు సీపీఎం ఎపి రైతుసంఘం సీనియర్ నాయకులు, సీపీఎం రైతు సంఘం అధ్యక్షులు కృష్ణయ్య, జి.ఈశ్వరయ్య, సీపీఐ ఎపి రైతు సంఘం అధ్యక్షులు, ఆళ్ళవెంకట గోపాలకృష్ణ, రాజకీయనేతలు, సామాజికవేత్తలు, ఇంజనీర్లు తదితరులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు.
Prajavartha Online Telugu News