విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్‌ను సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ‘నేటి పత్రిక ప్రజావార్త’ యాజమాన్యానికి అభినందనలు తెలిపి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వుంటూ ప్రజల మన్ననలు పొందుతూ నిత్యం ప్రజలలో వుంటూ అనునిత్యం ప్రజలకు ముందుగా వార్తలు అందజేస్తున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ అటు పేపర్‌గాను, ఇటు డిజిటల్ సోషల్ మీడియాలోను మరింత ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News