Breaking News

రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించాలి

-రహదారి ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
-ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలి: జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు.

శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 36వ జాతీయ రహదారి మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెసి సంబంధిత రవాణా, పోలీస్, ప్రజా రవాణా శాఖ అధికారులతో, పలువురు డ్రైవర్లు, యువత తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని అన్నారు. ఈ మధ్య కాలంలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దానికి వాహన చోదకులు రహదారి భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం కారణమని తెలిపారు. మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం తదితరాలు కూడా ఒక కారణమని కారణమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రహదారి ప్రమాదాల నివారణకు అనేక అవగాహన కార్యక్రమాలు, చట్టాలు చేసి అమలు చేస్తున్నప్పటికీ డ్రైవింగ్ లో నిర్లక్ష్యం వలన ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పక ధరించాలని, అలాగే ఇతర వాహనాలు వాడేటప్పుడు సీట్ బెల్ట్ తప్పక వాడాలని కోరారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పాట్ హోల్ ఫ్రీ గా మన రాష్ట్రాన్ని తీర్చి దిద్దేలా పలు చర్యలు చేపట్టారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో మన జిల్లాలో పలు జాతీయ రహదారులు బాగా తయారు అవుతున్నాయని పేర్కొన్నారు. సమాజంలోని పలు సెక్టార్ వారిని భాగస్వామ్యులు చేసి వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా నెల పాటు అనేక రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినందుకు రవాణా, పోలీస్, ప్రజా రవాణా, విద్యా శాఖ తదితర శాఖల వారిని అభినందించారు. ప్రతి నెలా రహదారి భద్రతా సమావేశాలు నిర్వహిస్తున్నామని, బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటి నివారణకు సమీక్షించి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.

జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీ మోహన్ మాట్లాడుతూ 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ప్రధాన శీర్షికగా
” రహదారి భద్రత ప్రచారం – శ్రద్ధ వహించండి” అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తదనుగుణంగా రహదారి భద్రతపై పలు రకాల వాహనదారులకు మరియు కాలేజీ విద్యార్థులకు మోటార్ వాహనాల నిబంధనల అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి ప్రచారం చేసామని తెలిపారు. మోటార్ వాహన చట్టం 1988 నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని, ఒక నెలలో సుమారు 100 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, పలు తనిఖీలు, పాఠశాలలలో, కళాశాలలలో రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాలు, పలు వక్తృత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించామని తెలిపారు. ఎన్హెచ్ఏఐ, రవాణా శాఖ కలిసి బ్లాక్ స్పాట్ లపై తనిఖీ లు చేసి సమీక్షించి పలు చర్యలు తీసుకున్నామని, ఐరాడ్ పై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టామని, రహదారి ప్రమాదాల నివారణకు ముఖ్యంగా శ్రద్ధ, జాగ్రత్త, అప్రమత్తత డ్రైవర్లకు అవసరం అని, రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని అన్నారు. డ్రైవర్లకు కంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు.

మాజీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి ఆదినారాయణ ప్రస్తుతం రహదారి భద్రతా అంశాలపై శిక్షణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణ చూస్తున్నామని తెలుపుతూ మోటర్ వాహనాల నిబంధనలకు సంబంధించి హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రైవింగ్ లో సెల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం, అధిక బరువు తీసుకెళ్లటం, అతివేగంగా వెళ్లడం అనే పలు అంశాలపై అవగాహన కల్పించారు.

పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రమాద రహిత డ్రైవింగ్ చేయడమే ప్రధాన లక్ష్యంగా డ్రైవర్లు ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే గోల్డెన్ హవర్ నందు రహదారి ప్రమాద బాధితుల్ని ఆసుపత్రిలో చేర్చితే చేర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.5వేలు ప్రోత్సాహకం ఇస్తుందని మరియు వారు ఎలాంటి కోర్టులకు తిరగాల్సిన అవసరం ఉండదని, కాబట్టి రోడ్డు ప్రమాద బాధితులకు అండగా గోల్డెన్ అవర్ నందు రహదారి ప్రమాద బాధితులను ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు.

అనంతరం జెసి చేతుల మీదుగా రవాణా శాఖ వారు నిర్వహించిన పలు పోటీలలో నెగ్గిన పాఠశాలల, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులకు, ఉత్తమ డ్రైవర్లకు, పలువురికి మోమెంటో లు అందచేశారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పీ, ఆర్టీసీ ఆర్ఎమ్ నరసింహులు, రవాణా శాఖ మోటార్ వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, మోహన్ కుమార్, ఆంజనేయ ప్రసాద్, వెంకటరమణ నాయక్, ఆంజనేయ వర్మ, రోడ్ సేఫ్టీ లాయర్ నిపుణులు బాలాజీ మరియు పరిపాలన అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *