-రెండవరోజు ఉత్సాహభరితంగా శాసనసభ, శాసనమండలి సభ్యుల క్రీడలు
-రసవత్తరంగా సాగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్
-మంత్రి సత్యకుమార్ యాదవ్ టీమ్‌పై మంత్రి నాదెండ్ల టీమ్ విజయం
-పరుగుపందెంలో ప్రజాప్రతినిధుల అత్యుత్తమ ప్రదర్శన
-కోలాహలంగా మారిన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శాసనసభ్యుల, శాసనమండలి సభ్యుల క్రీడాపోటీలు రెండవరోజూ అదే జోరుతో హుషారుగా జరిగాయి. శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పర్యవేక్షణలో నిర్వహించిన అథ్లెటిక్స్, క్రికెట్ ఫైనల్ మ్యాచ్, రన్నింగ్, కబడ్డీ, షాట్‌పుట్, త్రోబాల్, టెన్నిస్, మ్యూజికల్ చైర్, షటిల్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛీఫ్ విప్‌లు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని తమదైన శైలిలో ప్రతిభను కనబరిచారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రులు క్రీడాపోటీల్లో పాల్గొని సందడి చేస్తూ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ లెవన్ టీమ్, మంత్రి నాదెండ్ల మనోహర్ లెవన్ టీములుగా ఏర్పడి తలపడ్డారు. నాదెండ్ల టీమ్‌లో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బొమ్మాజి నిరంజన్ విజయ్‌కుమార్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, ఎ.ఉదయ్‌భాస్కర్, బీటీ నాయుడు, కె.ఈ.శ్యామ్, వంశీకృష్ణయాదవ్, ఎమ్.వెంకటరాజు, బొజ్జల సుధీర్ రెడ్డి, అనిమిల్లి రాధాకృష్ణ, ఏలూరి సాంబశివరావు, ఎన్.ఈశ్వరరావు, చిర్రి బాలరాజు, దాట్ల సుబ్బరాజు, బి.జయనాగేశ్వరరెడ్డి జట్టు సభ్యులు ఆడారు. అలాగే ప్రత్యర్థి మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ టీమ్‌లో పల్లా శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, యార్లగడ్డ వెంకట్రావు, పి.జి.వి.ఆర్ నాయుడు(గణబాబు), ఆదిరెడ్డి శ్రీనివాస్, సుందరపు విజయ్‌కుమార్, బి.దస్తగిరి, పి.వి.పార్థసారథి, గోవిందరావు, గురజాల జగన్మోహన్రావు, ఎమ్ఎస్.రాజు, కాకర్ల సురేష్‌లు జట్టు సభ్యులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాస్ గెలిచిన మంత్రి నాదెండ్ల మనోహర్ టీమ్ బ్యాటించ్ ఎంచుకున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, కె.ఈ.శ్యామ్‌లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అలాగే వారికి ధీటుగా ప్రత్యర్థి జట్టు బౌలర్లు పల్లా శ్రీనివాస్, మంత్రి సత్యకుమార్ యాదవ్‌లు తమదైన శైలిలో బౌలింగ్ చేస్తూ సవాల్ విసిరారు. అద్భుతమైన బ్యాటింగ్, అత్యుత్తమ కట్టడితో బౌలింగ్ చేస్తూ హోరాహోరీగా క్రీడాకారులు తలపడ్డారు.
100 మీటర్స్ పరుగుపందెంలో..
రెండవరోజు నిర్వహించిన క్రీడాపోటీల్లో భాగంగా 100 మీటర్ల పరుగుపందెం పోటీలు రసవత్తరంగా సాగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటాపోటీగా పాల్గొని పరుగులు పెట్టారు. మొదటి రౌండులో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్యేలు రామాంజనేయులు, బుచ్చయ్యచౌదరి, రఘురామకృష్ణంరాజు, కె.శ్రీనివాస్, గద్దె రామ్మోహనరావులు పాల్గొన్నారు. అలాగే రెండవ రౌండులో సుందరపు విజయ్‌కుమార్, బొజ్జల సుధీర్‌రెడ్డి, రఘురామకృష్ణం రాజులు పాల్గొని పరుగులు తీశారు. మూడవ రౌండులో డి.ప్రసాద్, సీహెచ్.బాలరాజు, జె.నాగేశ్వరరెడ్డి, విజయచంద్ర, ఎమ్.గోవిందరావు, శ్రీధర్, కాకర్ల సురేష్‌లో పాల్గొని హోరాహోరీగా పరుగులు తీశారు. నాల్గవ రౌండులో కే.ఈ.శ్యామ్, బి.నాయకర్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, పార్థసారథి, రాంగోపాల్‌రెడ్డి తదితరులు రన్నింగ్ పోటీల్లో పాల్గొన్నారు.
షాట్‌పుట్‌లో..
షాట్‌పుట్ క్రీడలో పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు క్రీడోత్సాహంతో పాల్గొన్నారు. 60 సంవత్సరాల విభాగంలో ప్రజాప్రతినిధులు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మెహన్‌రావు, బుచ్చయ్యచౌదరి, వంకా రవీంద్రనాథ్, రఘురామకృష్ణంరాజు, వరదరాజులరెడ్డి, ఎమ్ఎమ్.కొండయ్యలు పాల్గొన్నారు. అలాగే రెండవ రౌండులో ఎమ్.రాంప్రసాద్‌రెడ్డి, ఎస్.విజయ్‌కుమార్, శ్రీరామ్ తాతయ్య, వంశీకృష్ణయాదవ్, రాధాకృష్ణ, వర్ల కుమార్‌రాజా, బోడే ప్రసాద్, ఆదిరెడ్డి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, విజయ్‌కుమార్, వెనిగండ్ల రాము, కంచర్ల శ్రీకాంత్, గొండు శంకర్, ఏ.పార్థసారథి, శ్రీధర్, శ్రీరామ్‌రెడ్డి తదితరులు షాట్‌పుట్‌లో పాల్గొన్నారు.
మహిళా విభాగంలో..
టి.జగదీశ్వరి, గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, తంగిరాల సౌమ్య, ఎస్.సవిత, పల్లె సింధూరరెడ్డి, రెడ్డిప్పగారి మాధవీరెడ్డి, విజయేశ్వరి, పద్మశ్రీలు పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు.
మ్యూజికల్ ఛైర్ క్రీడలో..
మ్యూజికల్ ఛైర్ క్రీడలో మహిళా ప్రజాప్రతినిధులు సైతం ఉల్లాసంగా పాల్గొన్నారు. ఆద్యంతం ఉత్సాహభరితంగా పాల్గొని అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎస్.సవిత, పి.సింధూరరెడ్డి, తంగిరాల సౌమ్య, జి.చరితారెడ్డి, మిరియాల శిరీషా, పరిటాల సునీత పాల్గొని మ్యూజికల్ ఛైర్లో తమ ప్రతిభను చాటారు.
మీడియా ప్రతినిధులు, ప్రజాప్రతినిధుల క్రికెట్..
శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడాపోటీల్లో భాగంగా శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రజాసమస్యల పరిష్కారంలో అనునిత్యం తలమునకలయ్యే ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు కాస్తంత ఆటవిడుపు కల్పించాలనే ఉద్దేశంతో మీడియా కవరేజీకి వచ్చిన పలువురు మీడియా ప్రతినిధులను క్రీడల్లో భాగస్వామ్యం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, శ్యామ్ కుమార్, ఆదిరెడ్డి శ్రీనివాస్, అరిమళ్ల రాధాకృష్ణ తొలుత బ్యాటింగ్ చేశారు. అలాగే మీడియాప్రతినిధులు రాకేష్ , శ్రీనివాస్, సురేష్‌లు బౌలింగ్, ఫీల్డింగ్‌తో అద్భుతంగా రాణించి ఉత్సాహంగా గడిపారు.
పోటీల్లో గెలుపొందిన విజేతలు వీరే..
100 మీటర్స్ రన్నింగ్‌లో..
100 మీటర్ల రన్నింగ్‌లో మొదటి రౌండులో రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, రెండవ రౌండులో పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ.శ్యామ్ కుమార్, మూడవ రౌండులో ఎమ్మెల్యే రామాంజనేయులు విజయఢంకా మోగించి విజేతలుగా నిలిచారు.
షాట్‌పుట్ క్రీడలో..
షాట్‌పుట్ మహిళా విభాగంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పి.సింధూరరెడ్డి గెలుపొందారు. పురుషుల విభాగంలో మొదటి రౌండులో పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్‌కుమార్, రెండవ రౌండులో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విజేతలుగా నిలిచారు.
మ్యూజికల్ ఛైర్ క్రీడలో..
మ్యూజికల్ ఛైర్ క్రీడలో ప్రధమ స్థానంలో మిరియాల శిరీషా, ద్వితీయస్థానంలో ఎస్.సవిత, తృతీయస్థానంలో పల్లె సింధూరరెడ్డి విజేతలుగా నిలిచారు.
క్రికెట్లో నాదెండ్ల టీమ్ విజయం..
క్రికెట్ పోటీల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ టీమ్‌పై మంత్రి నాదెండ్ల టీమ్ విజయం సాధించింది. మంత్రి నాదెండ్ల మనోహర్ టీమ్‌లో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బొమ్మాజి నిరంజన్ విజయ్‌కుమార్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, ఎ.ఉదయ్‌భాస్కర్, బీటీ నాయుడు, కె.ఈ.శ్యామ్, వంశీకృష్ణయాదవ్, ఎమ్.వెంకటరాజు గారు, బొజ్జల సుధీర్ రెడ్డి, అనిమిల్లి రాధాకృష్ణ, ఏలూరి సాంబశివరావు, ఎన్.ఈశ్వరరావు, చిర్రి బాలరాజు, దాట్ల సుబ్బరాజు, బి.జయనాగేశ్వరరెడ్డి జట్టు సభ్యులు విజయం సాధించారు. 12 ఓవర్లలో 97పరుగులు చేసి విజయం సాధించి సంబరాలు చేసుకున్నారు. సందర్భంగా మంత్రి నాదెండ్లను జట్టు సభ్యులందరూ తమ భుజాలపైకి ఎత్తి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
టెన్నికాయిట్‌లో..
డా.దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన టెన్నికాయిట్ మహిళల డబుల్స్ విభాగంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జట్టు ప్రత్యర్థి జట్టయిన ఎమ్మెల్యేలు కె.లలితాకుమారి, పి.సింధూరరెడ్డిలపై అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించారు.
బ్యాడ్మింటన్ విభాగంలో..
పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో ఎమ్మెల్సీ శివరామిరెడ్డిపై ఎమ్మెల్యే నరసారావుపేట ఎమ్మెల్యే సి.అరవింద్‌బాబు విజయం సాధించారు.
వాలీబాల్‌లో..
*వాలీబాల్‌లో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి జట్టుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు జట్టు తలపడి విజయం సాధించింది. మంత్రి రాంప్రసాద్ జట్టులో వంగలపూడి అనిత, వర్ల కుమార్ రాజా, విజయ్‌కుమార్, వెనిగండ్ల రాము, గుమ్మడి సంధ్యారాణి, అదితి విజయలక్ష్మి గజపతి రాజు, కంచర్ల శ్రీకాంత్, బోడే ప్రసాద్, జి.శంకర్ పాల్గొని ఓటమి పాలయ్యారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు టీమ్‌లో పీజీవీఆర్ నాయుడు(గణబాబు), ఏ.శ్రీనివాసులు, గద్దె రామ్మోహన్రావు, బి.నాయకర్, భూమా అఖిలప్రియ, ఎస్.సబిత, శ్రావణి, రఘునాథరెడ్డి, రాజగోపాల్ పాల్గొని విజయఢంకా మోగించారు.
Prajavartha Online Telugu News