Breaking News

రూ.5కే నాణ్యమైన ఆహారం లభిస్తుండడం పట్ల ప్రజలు హర్షం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లలో రూ.5కే నాణ్యమైన ఆహారం లభిస్తుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు వచ్చే పేద ప్రజలకు రూ.5కే నాణ్యమైన ఆహారం లభిస్తుందని, ఆహారం తీసుకుంటున్న ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. ప్రస్తుతం టిఫిన్ చేయాలన్నా రూ.50 అవుతున్న పరిస్థితుల్లో పూటకు రూ.5కే కడుపు నిండుతుందన్నారు. ప్రజల డిమాండ్ కి తగిన విధంగా ఇండెండ్ పెంచాలని అక్షయ పాత్ర సిబ్బందికి, క్యాంటీన్ల పరిసరాల్లో పరిశుభ్రత, ఆహ్లాద వాతావరనం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *