-డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.28.03.2025 శుక్రవారం గుడివాడ లోని “K.B.R. గవర్నమెంట్ ఐటిఐ కళాశాల” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ డి.కె. బాలాజీ, ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో, టెక్నోటాస్క్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పేటిఎమ్, మోహన్ స్పింటెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి. విక్టర్ బాబు మరియు APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి dr పి.నరేష్ కుమార్ తెలిపారు.
ఈ కంపెనీ లలో గల ఉద్యోగాలకు టెన్త్, ఐటిఐ(ఫిట్టర్), ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన 18 నుండి 30 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి ఆసక్తికర వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, మార్చ్ 28న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, PAN మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 96666 54641, 98488 19682 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Prajavartha Online Telugu News