Breaking News

క్రొత్తగా నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంపై స్టేక్ హోల్డర్స్ తో సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నుండి నిజాంపట్నం పోర్ట్ వరకు క్రొత్తగా ( గ్రీన్ ఫీల్డ్ ) నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంపై స్టేక్ హోల్డర్స్ తో మంగళవారం మధ్యాహ్నం కలక్టరేట్ లోని మినీ శంకరన్ హాల్ లో జరిగిన సమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి , బాపట్ల పార్లమెంట్ సభ్యులు టీ. కృష్ణ ప్రసాద్ , గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు , బాపట్ల శాసన సభ్యులు వి.నరేంద్ర వర్మ , తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, జియంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు టీ. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నుండి నిజాంపట్నం పోర్ట్ వరకు క్రొత్తగా ( గ్రీన్ ఫీల్డ్ ) నాలుగు లైన్ల 47.848 కి.మీ రోడ్డు నిర్మాణం వల్ల ఎనలేని ఆర్ధిక అభివృద్ది జరుగుతుందన్నారు. అలాగే లాజిస్టిక్ ఎఫిషియన్సీ పెరుగుతుందన్నారు. ఈ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి సంబంధిత కేంద్ర మంత్రులతో అనేక దఫాలుగా చర్చించి వారిని ఒప్పించి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అయితే సూర్యలంక బీచ్ కు , చీరాల బీచ్ తో పాటు అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలు మరియు పొన్నూరు లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పర్యటకాభివృద్ది చెందుతుందన్నారు. వైజాగ్ – చెన్నయ్ ఇండస్ట్రీయల్ కారిడార్ కు మంచి కనెక్టివిటీ ఏర్పడుతుందని వివరించారు. దీనివల్ల నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ కు ఎక్కడా అవరోధం లేకుండా రోడ్డు ఏర్పడడం వల్ల మరింత ఆర్ధిక అభివృద్ధి బలోపేతం అవుతుందని వివరించారు. రోడ్డు నిర్మాణ పనులకు అన్ని అనుమతులు పొందిన తరువాత ఆరు మాసాల్లోపు భూ సేకరణ పనులు పూర్తి చేయాలని , అలాగే 18 మాసాల్లోపు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని తన ఆకాంక్షను తెలుపుతున్నానన్నారు. అనంతరం స్టేక్ హోల్డర్స్ అయిన ఆర్ అండ్ బి , విద్యుచ్ఛక్తి , ఇరిగేషన్ , రైల్వే , ఫిషరీస్ , అగ్రికల్చర్ , పంచాయితీ రాజ్ , దేవాదాయ శాఖ , అటవీ శాఖ అధికారులు వారి వారి శాఖలకు సంబంధించి ఏదైనా అంశాలు వుంటే పూర్తి వివరాలతో శుక్రవారం సాయంత్రం లోపు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ మరియు బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి సూచించారు. వారు అందించిన వివరాలను క్రోడీకరించి ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసి ఢిల్లీ లోని నేషనల్ హైవే అథారిటీ వారికి పంపి రోడ్డు నిర్మాణానికి అనుమతులు కోరడం జరుగుతుందని తెలిపారు. సమావేశ ప్రారంభంలో రోడ్డు నిర్మాణానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా నేషనల్ హైవే అథారిటీ అధికారులు వివరించడం జరిగింది.
ఈ సమావేశంలో ఎన్ హెచ్ ఏ ఐ ప్రాజెక్టు పార్వతీశం , డిఆర్ఓ ఎన్.ఎస్.కే.ఖాజావలి , పంచాయితీ రాజ్ ఎస్.ఈ బ్రహ్మయ్య, డిపిఓ నాగసాయి కుమార్, స్టేక్ హోల్డర్స్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *