గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
2026 ఎస్ ఎస్ సి పరీక్షల్లో గుంటూరు జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా విద్యాశాఖాధికారి , ప్రభుత్వ, మున్సిపల్ , జెడ్పీ , సంక్షేమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ కోరారు.
మంగళవారం సాయంత్రం కలక్టరేట్ లోని ఎస్. ఆర్. శంకరన్ హాల్ లో ఎస్ ఎస్ సి – 2025 పరీక్షల్లో 580 మార్కులకు పైబడి సాధించిన విద్యార్దులకు నిర్వహించిన అభినందన సభలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ , డిఇఓ సి.వి.రేణుక పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 600 లకు 580 పైబడి మార్కులు సాధించిన 34 మంది విద్యార్దులకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. విద్యార్ది దశలో పదవ తరగతి చాలా కీలకమని , దీనిని జయించిన వారు ఏమి చేయాలి అనేది నేర్చుకోవాలని , మీకంటూ ఒక లక్ష్యం వుండాలని , మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవాలన్నారు. ఏదైనా ఒక పెద్ద స్థాయికి వెళ్లాలనే లక్ష్యం పెట్టుకోవాలని , దానిని మనం అనుకుంటేనే సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్ది దశ నుండి ఐ ఏ ఎస్ వరకు చదువులో తన అనుభవాలను విద్యార్దులతో పంచుకున్నారు. గత మూడు సంవత్సరాల నుండి జిల్లాలో పదవ తరగతి పరీక్షలో చాలా వెనుకబడి వుందని , 2024 లో 16 వ స్థానంలో వున్న మనం , 2025 లో 4 వ స్థానం సాధించడం జరిగిందని , వచ్చే సంవత్సరం జిల్లాను మొదటి స్థానంలోకి తీసుకువచ్చేలా కృషి చేయాలని విద్యా శాఖఅధికారులకు సూచించారు. ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన తల్లితండ్రులకు , ప్రధానోపాధ్యాయులకు , ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ మాట్లాడుతూ కష్టపడి చదివితే ఎటువంటి లక్ష్యాన్ని అయిన సాధించవచ్చని , ప్రైవేట్ , కార్పరేట్ , టెక్నో స్కూల్స్ కంటే కేవలం మనం వెళ్ళే స్కూల్స్ లో ఉపాధ్యాయుల సహకారంతో చదివితే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ రోజుల్లో ఏది అసాధ్యం కాదన్నారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే వుందని , విద్యాశాఖాధికారులు మరింత ప్రతిభను కనబరిచేలా కృషి చేయాలన్నారు.
జిల్లా విద్యా శాఖ అధికారి సి. వి.రేణుక మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎస్ ఎస్ సి -2025 పరీక్షలో 88.53 శాతంతో గుంటూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో నాల్గవ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి రైటింగ్ , స్లీప్ టెస్ట్ లు నిర్వహించడం జరిగిందన్నారు. దాతల సహాయంతో విద్యార్దులకు స్నాక్స్ అందించడం జరిగిందని , దాని పర్యావసానమే రాష్ట్రంలో ఏ. పి రెసిడెన్షియల్ స్కూల్స్ లో 79 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 88.53 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని , ఉత్తీర్ణులు అయిన వారిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠాశాలల్లో పది వేల మంది విద్యార్దులకు గాను 1450 మందికి 500 మార్కులు పైగా సాధించడం జరిగిందని , 580 నుండి 592 వరకు 34 మంది సాధించారన్నారు.
అనంతరం 580 పైబడి మార్కులు సాధించిన విద్యార్దులను , ఉపాధ్యాయులను , తల్లితండ్రులకు బొకే అందించి శాలువాతో సన్మానించి జ్ఞాపికగా వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకాన్ని , సర్టిఫికేట్ , పెన్ను ను అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కే. వెంకట రెడ్డి , ఉప విద్యాశాఖాధికారులు ఏసురత్నం, శాంత కుమారి , యంఇఓ ఖుర్దూస్ , డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఖాసీం , ఉపాధ్యాయులు , విద్యార్దులు , తల్లితండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News