గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు , లక్ష్మీ కుమారి, ఆర్డిఓ కే.శ్రీనివాస రావు , జెడ్పీ సిఇఓ జ్యోతిబసు ప్రజల నుండి 199 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని గడువులోపు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. పరిష్కరించిన పిటీషన్లు గుణాత్మకంగా , సహేతుకంగా ఉందా , లేదా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి డియం అండ్ హెచ్ ఓ డా. శ్రావణ బాబు , సిపిఓ శేషశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News