Breaking News

ట్రంప్‌ వ్యాఖ్యలపై మోడీ జాతికి క్షమాపణ చెప్పాలి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తాను చెప్పడం వల్లే భారత్‌-పాకిస్తాన్‌ యుద్ధం ఆగిందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ జాతికి క్షమాపణ చెప్పాలని ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటుచేసి, దీనిపై సమగ్రంగా చర్చించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.
ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దుందుడుకు వ్యాఖ్యలు వింటుంటే 140 కోట్ల భారతజాతి యావత్తూ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధాని నరేంద్రమోడీకి ఎలా ఉందో అర్ధంకావడంలేదు. యునైటెడ్‌ స్టేట్స్‌ యంత్రాంగం, అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌, విదేశాంగమంత్రుల చొరవ వల్లనే భారత్‌`పాక్‌ యుద్ధం ఆగిపోయినట్లుÑ వాణిజ్య సంబంధాలు, వ్యాపార లావాదేవీలు జరగాలంటే యుద్ధాన్ని ఆపాలని హెచ్చరించడంవల్లే యుద్ధం ఆగినట్లు ట్రంప్‌ చెబుతున్నారు. ఇంతకంటే సిగ్గుచేటయిన విషయం ఏమయినా ఉందా? అని అడుగుతున్నాం. గుజరాత్‌కు చెందిన వ్యాపారస్తుల మద్దతు, వారు ఇస్తున్న డబ్బుతో ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్రమోడీ చివరకు వ్యాపార లావాదేవీల కోసం ట్రంప్‌ చెబితే యుద్ధాన్ని ఆపేశారా? ట్రంప్‌ వ్యాఖ్యలను ప్రధాని మోడీ ఎందుకు ఖండిరచడం లేదు? ఇది దేశ ప్రతిష్టను మంటగలపడం కాదా? అని సూటిగా ప్రశ్నిస్తున్నాం.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన మాటలను మోడీకి ధైర్యం ఉంటే ఖండిరచాలని, జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినదానికీ కానిదానికీ నరేంద్రమోడీని పొగుడుతున్నారు. పదేపదే ఎందుకు పొగుడుతున్నారో అర్ధంకావడంలేదు. ట్రంప్‌ బెదిరిస్తే యుద్ధం ఆపారని చెబుతుంటే, భారతదేశాన్ని మోడీ పైన నిలబెట్టారని చంద్రబాబు చెబుతున్నారు. ‘ట్రంప్‌ వ్యాఖ్యలు కరెక్ట్‌ కాదని, భారత ప్రభుత్వమే ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా యుద్ధం ఆగిందని’ చంద్రబాబు చెప్పగలరా? ‘ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య వివాదాల అంశాలలో మూడో దేశ ప్రమేయం అవసరంలేదని నాటి ప్రధానులు ఇందిరాగాంధీ, మన్మోహన్‌సింగ్‌లు స్పష్టం చేయడం జరిగింది. సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్‌`పాకిస్తాన్‌ల మధ్య సమస్యలు కేవలం ఇరుదేశాలు మాత్రమే మాట్లాడుకోవాలిగాని, మరొకరి ప్రమేయం ఉండకూడదు.
140 కోట్లు జనాభా ఉన్న భారతదేశ ఔన్నత్యం అమెరికాకు దాసోహమనే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాం. ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటుచేసి భారత్‌`పాక్‌ యుద్ధంపై, డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలపై పూర్తిస్థాయి చర్చ జరపాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *