Breaking News

APSSDC ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతి యువకులకు సర్టిఫికెట్స్ అందజేత…

-సంకల్ప్ పథకం ద్వారా APSSDC ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతి యువకులకు సర్టిఫికెట్స్ మరియు ఆఫర్ లెటర్ అందజేసిన జిల్లా ఇంచార్జి మరియు రెవిన్యూ రిజిస్ట్రేషన్ , స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సంకల్ప్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతి యువకులకు సర్టిఫికెట్స్ మరియు ఆఫర్ లెటర్స్ లను జిల్లా ఇంచార్జి మరియు రెవిన్యూ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని, జేసి శుభం బన్సల్ సంయుక్తంగా అందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా శుభ సంతోషమని సంబందిత అధికారులు అభినందించారు. అలాగే ఇలాంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ వారికి,DSDO కి అభినందనలు తెలుపుతూ ఇలాంటి స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు అలాగే ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాబోయే రోజుల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిశ్రమల అవసరాలకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అవసరాలకు తగ్గట్టు అడ్వాన్సుడ్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని తెలిపారు. అలాగే శిక్షణ పొందిన వారందరినీ అభినందించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ సంకల్ప పథకం ద్వారా ఏ పి యస్ యస్ డి సి ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ సంస్థలైన, జే ఎస్ ఎస్ , నాక్ , ఎస్వీ యూనివర్సిటీ, మహిళా ప్రాంగణం నందు నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ రకాల కోర్సులలో శిక్షణ మూడు నెలల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 270 మందికి వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి ,(టైలరింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటిషన్, టెక్స్టైల్ ప్రింటింగ్, డ్రోన్ పైలెట్ సర్వీసింగ్ & రిపేర్, అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, మగ్గం వర్క్ మొదలగు శిక్షణ కార్యక్రమాలు) మూడు నెలల పాటు నిర్వహించి, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్స్ మరియు ఆఫర్ లెటర్స్, గౌరవ మంత్రివర్యులు చేతుల మీదుగా అందించడం జరిగిందని తెలిపారు. వీరికి వివిధ రకాల కోర్సులను రూపొందించి పరిశ్రమలు శాఖల వారితో సమన్వయం చేసుకుంటూ యువతకు ఉపాధి అవకాశాల కొరకు అన్ని విధాలాగా సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. అలాగే మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ వివిధ సాంకేతిక సంస్థలు అన్ని కలుపుకొని స్కిల్ గ్యాప్ అనాల్సిస్ సర్వే పూర్తి చేసిన తర్వాత మరొక కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి అందరికీ ఉపయోగకరంగా ఇండస్ట్రీ వారికి, అలాగే అకాడమిక్ వారికి, నిరుద్యోగ యువతకి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మన జిల్లాలో ఉన్న అన్ని పరిశ్రమల్లో కల్పించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి.నరసింహులు, పిడి డిఆర్డిఏ టి.ఎన్. శోభన్ బాబు, డి ఎస్ డి ఓ, ఆర్ లోకనాథం, ఏపీ ఎస్ ఎస్ డి సి సిబ్బంది, ఎస్ వి యూనివర్సిటీ ప్రతినిధులు, నాక్ ప్రతినిధులు, శిక్షణ పొంది యువతీ యువకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *