Breaking News

మంజూరైన అన్ని గృహాలను 100 శాతం పూర్తి చేయాల్సిందే

-రెవెన్యూ, హౌసింగ్ అధికారులు సమన్వయం చేసుకొని పనిచేసి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
-రాష్ట్ర గృహనిర్మాణ మరియు ఐ.అండ్.పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మంజూరైన అన్ని గృహాలను ప్రణాళికా బద్దంగా వేగవంతం చేసి ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని రాష్ట్ర గృహనిర్మాణ మరియు ఐ.అండ్.పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (ప్రజావేదిక)లో బుధవారం సాయంత్రం జిల్లాలోని, కళ్యాణదుర్గం నియోజకవర్గం – గృహ నిర్మాణంపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, హౌసింగ్ ఎండితో కలిసి రాష్ట్ర గృహనిర్మాణ మరియు ఐ.అండ్.పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో పీఎంఏవై 1.0 కింద 74,489 గృహాలను మంజూరు చేయడం జరగగా, ఇప్పటివరకు 38,762 ఇళ్లను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 35,727 ఇళ్లను తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ఇళ్లను పూర్తి చేసేందుకు డిసెంబర్ వరకు సమయం ఉందని, అప్పటిలోపు మంజూరైన ప్రతి ఒక్కరి ఇళ్లను పూర్తి చేయాలని, లేకపోతే ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. ఇళ్ల గడువు గతేడాదే ముగిసిపోగా, కేంద్రంతో మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే డిసెంబర్ వరకు గడప పొడిగించడం జరిగిందని, అప్పటిలోపు ప్రణాళికాబద్ధంగా ఖచ్చితంగా పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఆయా తహసిల్దార్ కార్యాలయాల్లో ప్రతినెల సమావేశం పెట్టుకొని ఇళ్ల నిర్మాణంలో పురోగతి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటి స్థలం ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికేనని.. ఇల్లు కట్టుకోకపోతే రద్దు చేస్తామని నోటీసులు ఇవ్వాలన్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గ సమీక్ష :
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఐదు మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉండగా, మొత్తం 7,825 ఇల్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 4,052 ఇళ్లు పూర్తి కావడం జరిగిందని, ఇందుకోసం 98.51 కోట్ల రూపాయలను ఖర్చు చేశారన్నారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ, హౌసింగ్ అధికారులు సమన్వయం చేసుకొని పనిచేసి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల కోసం అవసరమైతే బ్యాంక్ మేనేజర్ లతో మాట్లాడి అదనపు రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేయాలన్నారు. పునాది నుండి ఆర్సి వరకు నిర్మాణాలపై దృష్టి పెట్టాలని, లబ్ధిదారులకు ప్రభుత్వ పథకం గురించి అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని ఎక్కడెక్కడ అయితే ఇంటి పట్టాలు ఇవ్వాలో అక్కడ ఇవ్వాలని సూచించారు. కాంట్రాక్టర్లకు మెటీరియల్ ఎక్కువ ఇచ్చి ఉంటే వారి నుంచి రికవరీ చేయాలన్నారు. ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు హౌసింగ్, రెవెన్యూ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ గృహ నిర్మాణంలో ఒకటికి రెండుసార్లు అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో లబ్ధిదారులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత తాను కూడా తీసుకుంటానన్నారు. రెవెన్యూ, హౌసింగ్ అధికారులు కలిసికట్టుగా ముందుకు వెళ్లి నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇళ్ల స్థలాల కోసం అవసరమైన భూమిని సేకరించి ఇవ్వాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో హౌసింగ్ ఎండి శివప్రసాద్, హౌసింగ్ పిడి శైలజ, ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్లు బాలకిషన్, భాస్కర్, సుమతి, ఈశ్వరమ్మ, శ్రీనివాసులు, ఈఈ శ్రీమన్నారాయణ, ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు, డీపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *