సెప్టెంబర్ 27 న ప్రపంచపర్యాటక దినోత్సవం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రస్థాయి ప్రపంచ పర్యాటక దినోత్సవవేడుకలు విశాఖపట్నంలో జరగనున్నాయి అని ఎస్ .సత్యనారాయణ ఐ.ఏ.ఎస్ సీఈఓ ఏపీ టి ఏ అండ్ ఎండి ఏపీ టీడీసీ తెలిపారు. గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రపంచ పర్యాటక దినోత్సవ ఏర్పాట్ల సమీక్షా సమావేశం గురించి పర్యాటక శాఖ అధికారులకు తెలియచేసారు. ఈ సందర్భంలో  ఎస్.సత్యనారాయణ ఐ.ఏ.ఎస్ పర్యాటకశాఖ అధికారులతో మాట్లాడుతూ 27 సెప్టెంబర్ 2021 ప్రపంచపర్యాటక దినోత్సవం సందర్భంగా, కోవిడ్ -19 ప్రోటోకాల్ను అనుసరించడానికి, రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాలలో ప్రపంచపర్యాటక దినోత్సవం రోజున అవగాహన కల్పించడానికి ప్రముఖ ప్రదేశాలలో డిస్ప్లే బ్యానర్లు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏపీ టీడీసీ హరిత హోటల్స్ & రిసార్ట్లను లైటులతో అలంకరించమని ఆదేశించారు. 27 సెప్టెంబర్ 2021 ప్రపంచపర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగాఉన్నఅన్ని ఏపీ టీడీసీ హరితహోటల్స్ & రిసార్ట్స్లో వసతి కల్పనలో 20 శాతం డిస్కౌంట్లను అందించమని పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రపంచవ్యాప్తoగా జరిగే కార్యక్రమం, ఇది సంవత్సరానికి ఒకసారి పర్యాటకం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ జరపబడుతుంది. ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీ ఆదేశం యొక్క పర్యాటకరంగం మీద ఆధారపడి ఉంది. మన రాష్ట్ర పర్యాటకశాఖ కోవిడ్ -19 ప్రోటోకాల్ను అనుసరిస్తూ సెప్టెంబర్ 27 న ప్రపంచపర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటుంది అని తెలిపారు.
ప్రపంచపర్యాటక దినోత్సవo గురించి :
1980 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27 న ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించబడుతుంది. ఈతేదీ 1970 లో సంస్థ యొక్కచట్టాలను ఆమోదించిన వార్షికోత్సవాన్నిసూచింపబడుతూ, ఐదు సంవత్సరాల తరువాత యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్ డబ్ల్యూ టిఓ) స్థాపనకు మార్గం సుగమం చేయబడింది. యునైటెడ్ నేషన్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్ టిఓ) ప్రతిసంవత్సరం ప్రపంచ పర్యాటక దినోత్సవం కోసం థీమ్ మరియు లోగో ను నిర్ణయిస్తుంది.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *