Breaking News

జీజీ హెచ్ లో ఓపీ విభాగాన్ని సరిదిద్దేందుకు ఉపక్రమించిన కలెక్టర్ జె.నివాస్…

– జీజీ హెచ్ లో మరిన్ని ఓపీ కౌంటర్లు
– రెండు గంటల పాటు ఆసుపత్రిలోని పలు విభాగాల పరిశీలన
– ఆరోగ్యశ్రీలో డెంగీ వైద్యం
– మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
-కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం ఓపి విభాగాన్ని మరింత సులభతరం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ జె.నివాస్. ఆసుపత్రిలోని ఓ పీ, ఇతర వైద్య విభాగాలను పరిశీలించారు. రద్దీ తో ఉన్న ఓపీ విభాగాన్ని సందర్శించిన కలెక్టర్ టోకెన్లు జారీ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కౌంటర్లలో కేవలం ముగ్గురే సిబ్బంది ఉండటాన్ని గమనించిన కలెక్టర్ ఇంత రద్దీ ఉన్నప్పుడు మరింత మంది సిబ్బందిని, కౌంటర్లను పెంచాలనేఆలోచన ఎందుకు రాలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.జగన్ మోహన్ రావుని ప్రశ్నించారు. వెనువెంటనే ఓపీ విభాగాన్ని సరిదిద్ధే చర్యలకు కలెక్టర్ జె.నివాస్ ఉపక్రమించారు. ఓపీలో పురుషులు, మహిళలకు వేరువేరుగా కౌంటర్లను ఏర్పాటు చేసే దిశగా మరిన్ని అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఒకటి రెండు రోజుల్లో సర్దుబాటు చర్యలు పూర్తి కావాలన్నారు. రేపట్నుంచే 10 కౌంటర్లకు పెంచి అదనంగా కావలసిన 1 కంప్యూటర్లను, సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఆసుపత్రిలో ఓపీ విభాగంలో పురుషుల విభాగాన్నిసందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు ఆరా తీశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున్న డెంగీ, మలేరియా జ్వరాలకు సంబంధించిన కేసులు ఏమేర వస్తున్నాయో వైద్యులను వాకబు చేశారు. వచ్చిన కేసులను బట్టి ల్యాబ్ పరీక్షలకు సిఫార్స్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మలేరియా, డెంగీ రోగులను పరిశీలించేందుకు అదనంగా మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ ను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు.
` అనంతరం ల్యాబ్ ను పరిశీ లించిన కలెక్టర్ మలేరియా టెస్టుల నిర్వహణ పై సంతృప్తి వ్యక్తం చేశారు. బయో కెమికల్ ల్యాబ్స్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను అదనంగా పెంచవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎక్స్ రే నిర్వహణకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ల్యాబ్ లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అందుకోసం ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి రోజు 20 నుండి 30 వరకు మలేరియా శాంపిల్స్ వస్తున్నాయని టెక్నీషియన్ చెప్పారు. అనంతరం డెంగీ పరీక్షలు నిర్వహించే ఏలీసా ల్యాబ్ ను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ సిబ్బందితో మాట్లాడి 40 నుంచి 50 వరకు ఓపీ ద్వారా శాంపిల్స్ వస్తున్నాయని ల్యాబ్ టెక్నీషియన్లు చెప్పారు. పరీక్షించే యంత్రం ఒకటి పాడైందని అలాగే మరో కొత్త యంత్రం కూడా అవసరం అవుతుందని టెక్నీషియన్స్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీని పై కలెక్టర్ స్పందిస్తూ వె టనే వీటిని ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ను ఆదేశించారు. అలాగే అదనంగా మరో ల్యాబ్ అసిస్టెంట్ నియామకానికి చర్యలు తీసుకోమని సూపరింటెండెంట్ ను కలెక్టర్ ఆదేశించారు. టెస్టింగ్ అనంతరం వచ్చిన రిపోర్టులను వెంటనే ఆయా పేషెంట్ల మొబైల్ నెంబరుకు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. దీనిపై అక్కడ టెక్నీషియన్ మాట్లాడుతూ వచ్చిన రిపోర్టులను వీఎంసీ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి డిఎం హెచ్ఓ, డిసిహెచ్ఎస్ లకు పంపుతున్నామని వివరించారు. డెం గీ వ్యాధి రోగులకు ఆరోగ్యశ్రీ క్రింద వైద్యం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చిందని ఆమేరకు వైద్యం అందించాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించేందుకు నిరాకరిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రేపట్నుంచే కొత్త జీజీ హెచ్ లో ఓపీ కౌంటర్లను పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్ వైద్యులను అదనంగా ఏర్పాటు చేసి వచ్చిన రోగులకు త్వరగా వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే జిల్లాలో వున్న ప్రతి గ్రామ పంచాయతీ లోను యాంటీలార్వా, ఫాగింగ్ , నీటి నిల్వలు లేకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టామని, ప్రతి శుక్రవారం ట్రైడేగా నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా ప్రతి మలేరియా సబ్ డివిజన్ పరిధిలోటెస్టింగ్ సౌకర్యాలను కూడా మెరుగుపరచడంతో పాటు ఎక్కువ టెస్టింగ్ లు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే వంచాయతీ కార్యదర్శులతో సీజనల్ వ్యాధులు నియంత్రించడం పై ప్రత్యేక సమావేశం నిర్వహించామన్నారు. రానున్న 45 రోజులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామని ఈదిశగా అందుకు తగిన చర్యలు వారు చేపట్టారన్నారు. జీజీ హెచ్ కి అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్స్ సరిపడా ఉంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి రోజు ఓపీ కింద ఉ.9 గం. నుంచి 11 గం. మధ్య టోకెన్లు ఇవ్వడం జరుగుతుందని అనంతర మధ్యాహ్నం 2 గం. ల వరకు వైద్యులు రోగులను పరీక్షించే ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట విజయవాడ సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.జగన్ మోహన్ రావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డా.విజయకృష్ణ, ఆర్ ఎంఓ డా.శోభ, డిప్యూటీ ఆర్ ఎంఒ డా.మంగా దేవి తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *