Breaking News

భ‌వానీ ద్వీపంలో సంప్ర‌దాయ క‌ళా వైభ‌వం

– రెండో రోజు ఘ‌నంగా ఆవకాయ్.. సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆవకాయ్.. సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవం రెండో రోజు భవానీ ద్వీపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు నగర ప్రజలు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ కళలకు వేదికగా నిలిచిన ఈ కార్యక్రమాలు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిబిరం ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. యువత ప్రదర్శించిన నైపుణ్యం అందరినీ ఆకర్షించింది. అలాగే, ప్రసిద్ధ నగాడా వాయిద్య కళాకారుల ప్రదర్శన ఉర్రూతలూగించి, కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పాల్గొని కళాకారులను అభినందించారు. అనంతరం కలెక్టర్ స్వయంగా సరదాగా నగాడా వాయిద్యం వాయించి ప్రేక్షకులను అలరించారు. సంప్రదాయ కళల పరిరక్షణలో ఇలాంటి ఉత్సవాల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయ‌న పేర్కొన్నారు.
సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న అమరావతోత్సవం ప్రజల్లో మంచి స్పందన పొందుతోందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఆకర్షణీయమైన కార్యక్రమాలకు ఈ ఉత్స‌వాలు వేదిక కానున్నాయ‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *