Breaking News

జిల్లాలో సెనగలు, కందులు, మినుముల కొనుగోలు ప్రారంభం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలో రైతుల నుంచి సెనగలు, కందులు, మినుములు కొనుగోలు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభించినట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. రబీ ( 2025-26) లో సెనగ సాగు చేసిన రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కలెక్టర్ కోరారు ప్రభుత్వం కనీసం మద్దతు ధరగా రూ. 5,875 ప్రకటించినట్లు తెలిపారు. జిల్లాలోని ఏడు మండలాల్లో సుమారు 5,166 హెక్టార్ల విస్తీర్ణంలో శనగ పంట సాగు చేయగా 13,003 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని తెలిపారు. రైతులు పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు విక్రయించాలని కోరారు. రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలలో సీఎం యాప్ లో వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. నమోదుకు సాగు చేసిన రైతు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రానికి వెళ్లి తమ బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆధార్ కార్డుతో అనుసంధానించిన బ్యాంక్ ఖాతా నెంబర్ , అవసరమైన జిరాక్స్ పత్రాలు సమర్పించాలని కోరారు. జిల్లాలో 50 రైతు సేవా కేంద్రాలలో కొను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ వారి మార్గనిర్దేశంతో కొనుగోలు ఏర్పాట్లు చేసినట్లు మార్క్ఫెడ్ డిఎం నాగమల్లిక తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *