Breaking News

అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాలాద్రి అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సోమవారం ఉదయం అమ్రిన్ హాస్పిటల్, భవానీపురం లో ఆకస్మికంగా తనిఖి నిర్వహించారు. అమ్రిన్ హాస్పిటల్, భవానీపురం లో క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి అగ్నిప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల సామాగ్రి ఉందా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటి వినియోగం తెలుసా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన నివారణ జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించడమే కాకుండా వారిచే వారి పరికరాలను ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *