విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల అభివృద్ధి కోసం రెడ్డిగూడెం, ఎ.కొండూరు, జి.కొండూరు మండలాల ఫుడ్ బాస్కెట్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వై. శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అవుతున్న పంటల మార్కెటింగ్, ధరల స్థిరీకరణ, రైతులకు నేరుగా లాభాలు చేకూరే విధానాలపై చర్చించారు.
ఫుడ్ బాస్కెట్ ద్వారా స్థానికంగా ఉత్పత్తి అయ్యే నాణ్యమైన సహజ ఉత్పత్తులను వినియోగదారులకు అందించడమే లక్ష్యమని తెలిపారు. రైతులు పండిస్తున్న కూరగాయలు, ధాన్యాలు, పండ్లను సమీకరించి సరైన ప్రణాళికతో మార్కెటింగ్ చేయాలని సూచించారు. కమిటీ సభ్యులు గ్రామ స్థాయిలో రైతులతో సమన్వయం చేసుకొని ఉత్పత్తుల సేకరణ, నిల్వ, రవాణా అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, వినియోగదారుల విశ్వాసం నిలబెట్టుకోవాలని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వై.శంకర్ నాయక్ సూచించారు. NFA హెల్త్ అండ్ న్యూట్రిషన్ మౌనిక,NFF కుసుమ,మాస్టర్ ట్రైనీస్,సమావేశంలో సంబంధిత మండలాల కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News