Breaking News

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 2026 ఓటరు జాబితా లోని ఓటర్లు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసుకోవాలి

-తిరుపతి ఆర్ డి ఓ, చంద్రగిరి నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి, రామ్మోహన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 2026 ఓటరు జాబితా లోని ఓటర్లు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసుకోవాలని తిరుపతి ఆర్డిఓ, చంద్రగిరి నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి రామ్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామంలో నిర్వహిస్తున్న ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుత ఓటర్లు 2002 సంవత్సరపు ఓటరు లిస్ట్ తో మ్యాపింగ్ కావలసి ఉందని తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియలో ఓటర్లు భాగస్వామ్యం కావాలని తెలిపారు, బిఎల్ఓ లు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఓటరు జాబితా మ్యాపింగ్ చేసుకొని ఓటర్లు జూన్ 14వ తేదీ లోపు తప్పని సరిగా సంబంధిత బూత్ లెవెల్ అధికారి వద్ద ఓటర్ల వివరాలు సమర్పించి సహకరించవలసిందిగా కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *