Breaking News

సైబర్ నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి

-సైబర్ నేరాలు,డిజిటల్ అరెస్టు లకు మోసపోకుండా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి
-ప్రధానమంత్రి నరేంద్ర మోడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ఉక్కుపాదం మోపాల్సిన తరుణం ఆసన్నమైందని వాటి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.
వివిధ రైల్వే ప్రాజెక్టులు,జాతీయ రహరులు,మెట్రోరైల్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇంటిగ్రేషన్ ఆఫ్ రెన్యువల్ ఎనర్జీ జోన్లు,టిబి ముక్త్ భారత్ అభియాన్,సైబర్ క్రైమ్ మరియు డిజిటల్ అరెస్టు సంబంధిత ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు,కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ప్రధాని వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని వాటిలోని సమస్యలను సమీక్షించి వివిధ శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని సిఎస్ లను ఆదేశించారు.
ఈ కార్యక్రమాలతో పాటు, పెరుగుతున్న డిజిటల్ నేరాలు అదుపు,టీబీ ముక్త్ భారత్ పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని పురోగతిని మెరుగుపరచాలని ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.

“డిజిటల్ అరెస్ట్” మరియు సైబర్ మోసాల సమస్యను తక్షణమే సాంకేతికత సహాయంతో నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడి సిఎస్ లను ఆదేశించారు. సైబర్ మోసాలు,డిజిటల్ అరెస్టు లపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సిఎస్ లకు స్పష్టం చేశారు.

అంతేగాక సైబర్ ఫిర్యాదులను త్వరితగతిన చర్య తీసుకోదగిన కేసులుగా మార్చేందుకు రాష్ట్రాలు ఇ-ఎఫ్‌ఐఆర్/జీరో ఎఫ్‌ఐఆర్ వ్యవస్థలను బలోపేతం చేయాలని ప్రధాని ఆదేశించారు.

అదే విధంగా మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింప జేయడం మరియు తిరిగి రాబట్టడం,మ్యూల్ ఖాతాలను గుర్తించడంలో బ్యాంకులు, పోలీసులు,ఆర్‌బిఐ మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని ప్రధాని మోడి స్పష్టం చేశారు.

సైబర్ మోసాల నుండి పౌరులను రక్షించడానికి,సైబర్ నేరాల కోసం ప్రత్యేక సంస్థాగత యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని, సైబర్ పోలీసుల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాని సూచించారు. ఇలాంటి నేరాలకు అవకాశం ఉన్న హాట్‌స్పాట్‌లను గుర్తించాలని, మరియు భారీ అవగాహన ప్రచారాలను నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆదేశించారు.

టీబీ ముక్త్ భారత్ అభియాన్ ను ముందస్తుగా గుర్తించడం,సంపూర్ణ చికిత్స, పోషకాహార మద్దతు మరియు సామాజిక భాగస్వామ్యం ద్వారా టీబీ వ్యాప్తిని,టీబీ సంబంధిత మరణాలను తగ్గించడంపై దృష్టి సారించి టీబీ ముక్త్ భారత్ కు కృషి చేయాలన్నారు. అధిక ప్రమాదం ఉన్న గ్రామాలు మరియు వార్డులు, ఏఐ ఆధారిత బలహీన ప్రాంతాల గుర్తింపు, విస్తృత స్క్రీనింగ్, ఎక్స్-రే పరీక్షలు మరియు ముందస్తు ల్యాబ్ పరీక్షలపై దృష్టి సారించాలన్నారు.

దేశంలో ఇప్పటికే సుమారు 67,933 గ్రామ పంచాయతీలు టీబీ రహితంగా ధృవీకరించ బడ్డాయని ప్రధాని మోడి పేర్కొన్నారు.క్షయవ్యాధి (టీబీ) స్క్రీనింగ్‌ను సమగ్రంగా నిర్వహించడం,అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు 100% పరీక్షలు చేయడం, కుటుంబ సభ్యులకు నివారణ చికిత్స అందించడం మరియు బలహీన రోగులకు ప్రత్యేక శ్రద్ధతో కూడిన సంరక్షణను అందించడం వంటివి రాష్ట్రాలు నిర్వహించాలని చెప్పారు.

విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు,ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, ఎస్పి సిఐడి గంగాధర్ రావు, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *