Breaking News

శ్యామ ప్రసాద్ ముఖర్జీ జీవితం యువతకు ఆదర్శం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డా శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి (జూలై 6) మరియు బలిదాన్ దివస్ (జూన్ 23) సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయిలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గురువారం, భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి శ్యామ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖర్జీ చేపట్టిన “ఒక దేశం, ఒకే రాజ్యాంగం” ఆశయాలను, ఆయన దేశానికి చేసిన త్యాగాలను బీజేపీ నాయకులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమైక్యత జాతీయత కోసం శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు, సిద్ధాంతాలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు..

ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్ , బీజేపీ మండల అధ్యక్షులు పగడాల కృష్ణ, దేవిన హరిప్రసాద్, బీజేపీ నేతలు బెన్నా భక్తుల సోమేశ్వరరావు, పోలవరపు దుర్గారావు, రామకృష్ణ, హరీష్ వ్యాస్, అడ్డూరి భాస్కరరావు కూటమి నేతలు పీవీ చిన సుబ్బయ్య, బొడ్డుపల్లి శ్రీనివాసరావు, చిన బాబు, కూర్మారావు, బొమ్ము రాంబాబు, నాగోతీ రామారావు, తమ్మిన లీల, ప్రదీప్ రాజ్ పాల్గొని శ్యామ ప్రసాద్ ముఖర్జీ కు నివాళులర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *