Breaking News

విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమలోని విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏఈ లు కూటమి నేతలతో కలసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు, సుజనా మిత్రా కోఆర్డినేటర్ల తో చర్చించి ఎఈ లు విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాలలో ఇబ్బందికరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, వీధిలైట్ల సమస్యలు, నూతనంగా ఏర్పాటు చేయవలసిన వీధిలైట్లు, విద్యుత్ స్తంభాల వివరాలను కూటమి నేతలు, సుజనా మిత్రాలు ఎ ఈ ల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సావధానంగా విన్నఎ ఈ లు ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.

ఎ ఈ లు సతీష్ కుమార్, జయంత్ కళ్యాణ్, రాంప్రసాద్, జానీ భాష, వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, నాగోతి రామారావు,ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్ , బీజేపీ మండల అధ్యక్షులు పగడాల కృష్ణ, దేవిన హరిప్రసాద్, బీజేపీ నేతలు బెన్నా భక్తుల సోమేశ్వరరావు, పోలవరపు దుర్గారావు, రామకృష్ణ, హరీష్ వ్యాస్, విస్సం శెట్టి శ్రీనివాస్, అడ్డూరి భాస్కరరావు కూటమి నేతలు పీవీ చిన సుబ్బయ్య, బొడ్డుపల్లి శ్రీనివాసరావు, చిన బాబు, కూర్మారావు,బొమ్ము రాంబాబు, తమ్మిన లీల తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *