Breaking News

మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసిలు అందజేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు.

35 వ డివిజన్ , పేజ్జోని పేటకు చెందిన పొట్టిపాటి వర్థనమ్మ (45) హృద్రోగం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన
రూ 10 లక్షల 27 వేల ఎల్ ఓ సీ ను బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.

47 వ డివిజన్, కుండల బజార్ కు చెందిన కే భరత్ ( 24 ) రోడ్డు ప్రమాదంలో గాయపడి మెరుగైన వైద్యం కోసం ఎన్డీయే కార్యాలయంలో ఎల్ ఓ సీ కొరకు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3 లక్షల 50 వేల ఎల్ ఓ సీ ను అందజేశారు. అదేవిధంగా 53 వ డివిజన్,సీతార ప్రాంతానికి చెందిన అంకం రమణ (53) మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3 లక్షల 33 వేల ఎల్ ఓ సీ ను బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.

త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేయడంతో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే
సుజనా కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు దేవిన హరిప్రసాద్, మలపరెడ్డి అప్పారావు, శివరాత్రి శ్రీను, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *