Breaking News

సర్ లో సమస్యలేమైనా ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కు సంబంధించి గడువు నేటితో ముగియనున్నందున సర్ లో సమస్యలేమైనా ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ ఐ. కిషోర్ తెలిపారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కు సంబంధించి నగరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, బి.యల్.ఓలు ఇప్పటికే నగరంలో ఓటర్లకు ఎన్యుమరేషణ్ ఫారాలను అందజేయుట మరియు వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ నూరు శాతం పూర్తైయ్యందన్నారు. ప్రస్తుతం గుంటూరు నగరంలో జరుగుతున్న సర్ ప్రక్రియను నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది, బి.యల్.ఓ లు ఎటువంటి తప్పులు లేకుండా ట్రాన్స్ఫరెంట్ గా చేశారని తెలియచేశారు. బి.యల్.ఓ లు స్థానిక బి.యల్.ఏ ల తో సమావేశాలు ఏర్పాటు చేసి, జరిగిన మీటింగ్ యొక్క మినిట్స్ ను అప్ లోడ్ చేయాలని తెలియచేశారు. సర్ ప్రక్రియకు గడువును నేటితో అనగా జూలై 24 వ తేదీతో ముగుస్తుందని, కావున రాజకీయ పార్టీల ప్రతినిధులకు మ్యాపింగ్ లో, ఏ.యస్.డి (అబ్సెంట్, షిఫ్టింగ్, డెత్, డూప్లికేట్)లో ఏమైనా సందేహాలు లేదా తప్పులు ఉన్నట్లు గుర్తించినట్లైతే తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే వాటిని పరిష్కరిస్తామని తెలియచేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 31 మొదటి డ్రాఫ్ట్ పబ్లికేషణ్ ఉంటుందని తెలియచేశారు.

సమావేశం నందు ఈస్ట్ ఏఈఆర్ఓ సాంబశివరావు,డిటిలు నాగమల్లేశ్వరావు, సుధా కిరణ్మయి, మరియు ఎలక్షన్ సూపరింటెండెంట్ బాలాజీ బాష, రాజకీయ పార్టీల ప్రతినిధులు టిడిపి ఓంకార్, సతీష్, జీలాని, బిజేపి నారాయణ రెడ్డి, కుమార్, వైస్సార్సీపీ మహేష్ రెడ్డి, కిషోర్ బాబు, బియస్పి వాసు, జనసేన త్రినాద్, కాంగ్రెస్ షేక్ జానీ బాషా, సిపీఐ(యం) ఖాసిం షహేద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *