Breaking News

రెవిన్యూ విభాగానికి సంబంధించిన సేవలను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో రెవిన్యూ విభాగానికి సంబంధించిన సేవలను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని, రెవిన్యూ సేవల్లో జాప్యం వహిస్తే అందుకు బాద్యులైన వారి పై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ రెవిన్యూ అధికారులను, ఇన్స్పెక్టర్ లను హెచ్చరించారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్ నందు రెవిన్యూ అధికారులు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ పరిధిలో వాటర్ చార్జెస్ కలెక్షన్లు మందకొడిగా సాగుతున్నాయని, ఆర్.ఐ ల వారీగా వారి పరిధిలోని బకాయిలను పూర్తి స్తాయిలో వసూళ్లు చేయాలని రెవిన్యూ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. నగర పాలక సంస్థ షాప్ ల బకాయిలను కూడా నూరు శాతం వసూలు చేయాలని, లీజు ముగిసిన షాప్ లకు ఎటువంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన ఆక్షన్ నిర్వహించేలా ప్రణాలికలు సిద్ధిం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవిన్యూ విభాగానికి సంబంధించి ప్రజల నుండి వచ్చే పిర్యాదులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, అంతేకాక రెవిన్యూ విభాగానికి సంబంధించి ప్రజల నుండి వచ్చే సర్విస్ రిక్వెస్ట్ లు (మ్యుటేషన్, న్యూ టాక్స్, వి.యల్.టి) వంటి వాటిని కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని రెవిన్యూ అధికారులను, ఇన్స్పెక్టర్ లను ఆదేశించారు. రెవిన్యూ సేవలకు సబంధించి ప్రజల నుండి వచ్చే పిర్యాదులు మరియు సేవలను ఎటువంటి కారణం లేకుండా రిజెక్ట్ చేస్తే సంబంధిత రెవిన్యూ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకొనుట జరుగుతుందని ఆర్.ఐ లను హెచ్చరించారు.
సమావేశంలో అదనపు కమిషనర్ ఐ. కిషోర్, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సి.హెచ్.శ్రీనివాస్, జి.సాంబశివరావు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *