-అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పన్నుల వాటా కేటాయింపుతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అదనపు పన్నుల వాటా విడుదలతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల అమలు మరింత వేగవంతం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి నిరంతరం అందిస్తున్న సహకారం రాష్ట్ర పురోగతికి ఎంతో దోహదపడుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News