జాతీయ మీడియా అవార్డులు – 2021 కు ఎంట్రీలు ఆహ్వానం

-ప్రింట్, టి.వి., రేడియో, ఇంటర్నెట్/సోషల్ మీడియా కేటగిరీల్లో పురస్కారం.
-నవంబర్ 30వ తేదీ లోగా ఎంట్రీలను భారత ఎన్నికల సంఘానికి పంపాలి.
-2022 జనవరి 25 న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున అవార్డుల ప్రధానం.
– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కే. విజయానంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు హక్కు వినియోగంపై ఓటర్లలో చైతన్యం మరియు అవగాహన కల్పించేందుకు 2012 నుండి కృషి చేసిన ఉత్తమ ప్రధాన మాధ్యమాలకు జాతీయ మీడియా అవార్డులను ప్రధానం చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కే. విజయానంద్ ఒక ప్రకటనలో తెలియజేసారు. ప్రింట్, టి.వి., రేడియో, ఇంటర్నెట్/సోషల్ మీడియా తదితర నాలుగు కేటగిరీల్లో ఈ పురస్కారాలు ఇవ్వనున్నట్లు అయన తెలిపారు. అర్హత గల వారు నవంబర్ 30ప్ తేదీ లోగ ఎంట్రీలను పంపాలని ఈ ఎంట్రీలను భారత ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుందన్నారు. 2022 జనవరి 25 న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ఉత్తమ మీడియా సంస్థలకు ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. అవార్డు క్రిందసైటేషన్, ఫలకం (Plaque) ప్రధానం చేయనున్నారని సి. ఇ. ఓ. తెలిపారు.ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ఓటర్లను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు ప్రతి ఒక్కరిలో ఓటుహక్కు వినియోగం పై చైతన్యం కలిగించడం, ఓటర్ గా నమోదు, రిజిస్ట్రేషన్ వంటి అంశాల్లో విశేష కృషి చేసిన మీడియా హౌస్ లకు భారత ఎన్నికల సంఘం ఈ అవార్డులను ప్రధానం చేయనుందని ఆయన పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘంచే ఏర్పాటు చేయబడిన ప్రత్యేక జ్యూరీ మాధ్యమాలు నిర్వహించిన క్వాలిటీ ఆఫ్ ఓటర్ అవేర్ నెస్ క్యాంపైన్, ఎక్స్ లెంట్ ఆఫ్ కవరేజ్/క్వాంటిటీ, ఓటర్ అవగాహనా కార్యక్రమాలు ఆధారంగా ఉత్తమ ఎంట్రీలను ఎంపిక చేసి పురస్కారాలను అందజేయడం జరుగుతుందని సి. ఇ. ఓ. విజయానంద్ తెలిపారు.
ఎంట్రీలకుసంబంధించి ప్రింట్ మీడియా న్యూస్ ఐటమ్స్/ఆర్టికల్స్ ప్రచురితమైన కాలం, సెంటీమీటర్ లు వివరాలను సాఫ్ట్ కాపీ, పి.డి.ఎఫ్. న్యూస్ పేపర్/ఆర్టికల్స్ ఫుల్ సైజు ఫోటో కాపీ/ప్రింట్ కాపీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. బ్రాడ్ కాస్ట్ టెలివిజన్ (ఎలక్ట్రానిక్) మరియు రేడియో (ఎలక్ట్రానిక్) ఎంట్రీలు క్యాంపెయిన్/ వర్క్ సంక్షిప్త సమాచారం సి.డి. లేదా డి.వి.డి. లేదా పెన్ డ్రైవ్ ద్వారా బ్రాడ్ కాస్ట్/టెలి కాస్ట్ అయిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే అన్ని స్పాట్ లు/ న్యూస్ వివరాలను ఓటర్ అవగాహనకు అవగాహనకు సంబందించిన న్యూస్ ఫీచర్లు లేదా ప్రోగ్రాములకు సంబందించిన సి.డి. లేదా డి.వి.డి. లేదా పెన్ డ్రైవ్ రూపంలో టెలి కాస్ట్ / బ్రాడ్ కాస్ట్ అయినా వ్యవధి, తేదీ, సమయం మరియు ఫ్రీకెవెన్సీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ (ఇంటర్నెట్)/సోషల్ మీడియా ఎంట్రీలు పంపిన వారు విధిగా ఓటర్ అవగాహనకు సంబంధించిన ఆ నిర్దేశిత సమయంలో పోస్టులు/బ్లాగ్స్/క్యాంపెయిన్ లు/ట్వీట్లు/ఆర్టికల్స్ వంటి వాటి వివరాలను పి.డి.ఎఫ్. సాఫ్ట్ కాపీ లేదా సంబంధిత వెబ్ లింక్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పబ్లిక్ ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఇతర కార్యక్రమాలు, ఇంపాక్ట్ ఆఫ్ ఆన్ లైన్ ఆక్టివిటీ వివరాలను ఆయా ఎంట్రీలతో కలిపి సమర్పించాల్సి ఉంటుంది.
ఓటర్లలో చైతన్యం, అవగాహనపై నేషనల్ మీడియా అవార్డ్స్- 2021 కు ఎంట్రీలు పంపే వారు హిందీ, ఆంగ్లం మినహా మిగతా భాషలకు సంబంధించినవి ఆంగ్లం ట్రాన్సలేషన్ తో కలిపి పంపాల్సి ఉంటుంది. ప్రతి ఎంట్రీకి సంబంధించి విధిగా మీడియా హౌస్ యొక్క పేరు, అడ్రస్, టెలిఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్ లు మరియు ఇ మెయిల్ అడ్రస్ కలిగి ఉండాలి. ఎంట్రీలను 2021 నవంబర్ 30 వ తేదీ లోగా ఈ క్రింది అడ్రస్ కు పంపాల్సి ఉంటుందని సి. ఇ. ఓ. విజయానంద్ తెలిపారు.
ఎంట్రీలు పంపాల్సిన చిరునామా:
పవన్ దివాన్, అండర్ సెక్రటరీ (కమ్యూనికేషన్),
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సడన్,
అశోక్ రోడ్డు, న్యూ ఢిల్లీ 110 001,
ఇ మెయిల్:media-division@eci.gov.in.,
Phone No. 011-23052133.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *