-పీబీ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో స్వాతంత్ర్య స్పూర్తి నింపే సాంస్కృతిక ప్రదర్శనలు
-నేడు నగరం నాలుగుదిక్కుల నుంచి ర్యాలీలు
-జాయింట్ కలెక్టర్ కె.మోహన్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాధీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26, 27 తేదీల్లో నగరంలోని పిబి సిద్దార్థ కళాశాలలో స్వాతంత్ర్య స్ఫూర్తి నింపే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కె.మోహన్ కుమార్ తెలిపారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం సమర్పించిన రోజును పురస్కరించుకొని దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ నెల 26 27 తేదీల్లో రెండు రోజులు పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహస్తున్నాం. జిగ్నాసా ,యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 26 వ తేదీ ఇందిరాగాంధీ స్టేడియంకు నాలుగు వైపులా ఎస్ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీబీ సిద్దార్థ డ్రిగ్రి కళాశాల, బాపూజీ మ్యూజియం, బెంజ్ సర్కిల్ నుంచి సుమారు 4 వేల మంది విద్యార్థిని,విద్యార్థులతో ఉదయం 7 గంటల నుంచి వివిధ సాంప్రదాయ వేషదారణలతో, నృత్యాలు, సంగీత వాయిద్యాలతో దేశ సంస్కృతీ సoప్రదాయాలను తెలియజేసే విధంగా ర్యాలీ ప్రారంభం. ఉదయం 9.00 గంటలకు ఇందిరాగాంధి స్టేడియంకు చేరుకుని భారతదేశ పఠం ఆకృతిలో విద్యార్థులు ప్రదర్శన ఇస్తారన్నారు.
Prajavartha Online Telugu News