వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి…

-ఏపీ వీఆర్ఏ సంక్షేమ సంఘం డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని గ్రామ రెవిన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవిన్యూ సహాయకుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నల్లిపోగు నాగేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్మది ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు సంఘం ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో సుమారు 20,000 మంది వీఆర్ఏలు విధులు నిర్వహిస్తున్నారని, వీరంతా పార్ట్ టైం పేరుతో పూర్తి స్థాయిలో వెట్టిచాకిరికి గురవుతున్నారని నాగేశం, ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన అత్యంత నిరుపేదలని పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్లుగా వేతనంలో ఒక్క రూపాయి కూడా పెంపుదల లేక, కేవలం రూ.10,500 వేతనంతో వీఆర్ఏలు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విధంగా ఏపీలోనూ వెంటనే పే స్కేల్ వర్తింపజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సంఘం ప్రధాన డిమాండ్లు ఇవే ప్రమోషన్ కోటా పెంపు వీఆర్ఏలకు ఇంటర్మీడియట్ అర్హతపై వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న 30 శాతం కోటాను 70 శాతానికి పెంచాలి. వన్ టైం సెటిల్ మెంట్ కింద పదోన్నతుల నియామకాలు జరపాలి. నామినీ వీఆర్ఏలను వెంటనే రెగ్యులర్ చేయాలి. ఇంటి స్థలాలు సీఆర్డీఏ మరియు అమరావతి పరిధిలోని విజయవాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వీఆర్ఏలకు రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలాలు కేటాయించి, ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శులు కోడూరు పుల్లయ్య, మచ్చల అంకయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బట్ల నాగసుబ్బయ్య యాదవ్ మరియు సుమారు 20 మంది వీఆర్ఏలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *