డిల్లీకి చెందిన ప్రముఖ ఐఎఎస్ బోధనా సంస్థ వజీరమ్ అండ్ రవి ఐఎఎస్ సంస్థ తో కెఎల్ యు అవగాహనా ఒప్పందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉన్నత విద్యారంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన విజయవాడ, కె.ఎల్. యూనివర్సిటీ-ఢిల్లీలోని ప్రముఖ ఐఎఎస్ బోధనా సంస్థ అయిన వజీరమ్ అండ్ రవి ఐఎఎస్ సంస్థ తో అవగాహనా ఒప్పందన్ని కుదుర్చుకుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని కెఎల్ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ డాక్టర్ జి. పార్ధసారధి వర్మ తెలిపారు. శుక్రవారం విజయవాడ లోని కెఎల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు అనేక వందల మంది విద్యార్ధులను ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ ఎస్ అధికారులుగా తీర్చి దిద్దిన చరిత్ర కలిగిన ఉన్నత విద్యాసంస్థ వజీరమ్ అనే విషయం అందరికీ తెలిసినదేనని అన్నారు. 2025 లో యుపిఎస్సి ప్రకటించిన ఫలితాలలో మొదటి 100 రాంకులలో సుమారు 30 మంది ఈ సంస్థలో కోచింగ్ తీసుకున్న విద్యార్ధులే కావడం గమనార్హమన్నారు. ఈ సంస్థ ద్వారా ఈ విద్యాసంవత్సరం నుండి మన కె. ఎల్. యూనివర్సిటీ, విజయవాడ కాంపస్ విద్యార్ధులకు సివిల్ సర్వీసెస్ లో క్లాసులు బోధించడానికి అవగాహనా ఒప్పందం కుదిరింది. బిఎతో పాటు ఐఎఎస్ ఓరియంటేషన్ కోర్సులో చేరిన విద్యార్దులకు వజీరమ్ అండ్ రవి ఐఎఎస్ సెంటర్ , డిల్లీ వారు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. కేవలం బోధనా తరగతులు నిర్వహించడమే కాక ఆ సంస్థ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన స్టడీ మెటీరియల్ కూడా విద్యార్ధులకు అందజేస్తారని అన్నారు. దీని ద్వారా బిఎతో పాటు ఐఎఎస్ ఇంటిగ్రేటెడ్ కోర్సు లో చేరిన విద్యార్ధులకు యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అన్ని పేపర్లపై పట్టు సాధించే అవకాశం వుంటుందన్నారు. ఇప్పుడు ఢిల్లీలో డిగ్రీ పూర్తైన విద్యార్ధులకు మాత్రమే కోచింగ్ ఇచ్చే వజీరమ్ సంస్థ కె.ఎల్.విశ్వవిద్యాలయంలో బి.ఏ. చదువుతూనే అంటే మూడేళ్ళలోనే సివిల్ సర్వీసెస్ సిలబస్ మొత్తం బోధించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ క్లాసులకు ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ క్లాసులకు విద్యార్థులను అనుమతిస్తారన్నారు. విషయ పరిజ్ఞానానికి డిల్లీకి చెందిన వజీరమ్ అండ్ రవి ఐఎఎస్ సంస్థ వారి ప్రత్యేక పోర్టల్ అందుబాటులో వుంటుందన్నారు. యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ అన్ని పేపర్లు (ప్రిలిమ్స్ మరియు మెయిన్స్) అంశాలపై సుశిక్షితమైన బోధన చేయడం. రికార్డ్ చేసిన క్లాసులు మరియు టెస్ట్ సీరీస్ పొందేందుకు అవకాశం. వ్యక్తిగతమైన మెంటార్షిప్ మరియు కౌన్సిలింగ్ అందుబాటులో.. విద్యార్థి ప్రగతి విషయమై అంశాలవారీ పరీక్షలు.. బిఎతో పాటు ఐఎఎస్ ఓరియంటేషన్ కోర్సు లో చేరిన విద్యార్దులకు దీని కోసం ప్రత్యేకమైన ఫీజు ఏమీ ఉండదు. బిఎతో పాటు ఐఎఎస్ ఓరియంటేషన్ కోర్సు పూర్తయ్యే వరకు నిష్ణాతులైన అధ్యాపక బృందంచే నిరంతర పర్యవేక్షణ మరియు బోధన.
ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి.పార్ధసారధివర్మ, ఆర్ట్స్ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సలహాదారు డాక్టర్ శ్రీనివాస్ పుట్టం, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాస్, ఎంహెచ్ ఎస్ డీన్ డాక్టర్ ఎం.కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *