Breaking News

ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ 162.72 కోట్ల చెల్లింపులు

-గడిచిన 4 నెలల్లో ఇప్పటివరకు మొత్తం రూ.1,504 కోట్లు వాటి ఖాతాలకు జమ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద సేవలందిస్తున్న 721 ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.162.72 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు చెల్లింపులు కూడా పూర్తయ్యాయి. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు, ASHA మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ఏప్రిల్ నుంచి ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు బీడీఏస్ (bill discounting system) ద్వారా రూ.1,108.48 కోట్లు ప్రైవేట్ ఆసుపత్రుల ఖాతాలకు జమయ్యాయి. ఇవి కాకుండా ప్రభుత్వం ద్వారా మరో 396.40 కోట్ల రూపాయలు ఆస్పత్రుల ఖాతాలకు చేరాయి. ఇలా..రెండు పద్ధతుల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.1,504.88 కోట్ల వరకు ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *