Breaking News

విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయం : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సామాన్యులకు సైతం పాలనను చేరువ చేయడానికి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజన నిర్ణయం చరిత్ర లో నిలిచిపోతుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం కృష్ణాజిల్లా ప్రజల చిరకాల కోరిక ను నెరవేరుస్తూ నూతనంగా ఏర్పాటు అయినా విజయవాడ జిల్లాకు స్వర్గీయ నందమూరి తారకరామారావు  పెడుతూ ‘ఎన్టీఆర్ జిల్లాగా’ నామకరణం చేసినందుకు మద్దతు గా భారీ ఎత్తున వచ్చిన యువతతో కలిసి అవినాష్ చుట్టుగుంట బీ.ఎస్.యన్.యల్.ఆఫీస్ నుండి పోలి క్లినిక్ రోడ్డు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు జగన్  తీసుకొన్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం అని ఎన్టీఆర్ మీద మా పార్టీకి ఉన్న గౌరవం ఇది అని అన్నారు. తెలుగుదేశం నాయకులు కేవలం ఓట్లు కోసం ఎన్టీఆర్ పేరును వాడుకోవడం తప్ప ఆయనకు గౌరవించడం తెలీదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయంలో వారికి ఎన్టీఆర్  ఫోటో లతో పని లేదని, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా ఆయన పుట్టిన జిల్లాకు ఆయన పేరు పెట్టాలనే ఆలోచన కూడా రాలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైసీపీ పాలన సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజులు అని, పరిపాలన సౌలభ్యం ప్రజలకు మరింత మంచి చేయడానికి మాత్రమే ఈ జిల్లాల విభజన అని పేర్కొన్నారు. రాజేశేఖర్ రెడ్డి కుమారుడిగా దమ్మున్న ముఖ్యమంత్రి గా ఇచ్చినమాట కట్టుబడి ఎన్టీ.ఆర్ జిల్లా గ పెట్టడం స్థిరస్థాయి గా చరిత్రలో నిలుస్తారు. వైస్సార్సీపీ నాయకులే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి 30సవంత్సరాలు ఉండలని కోరుకుంటున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అల్లా చెల్లారావు, కొరివి చైతన్య వర, చిమట బుజ్జి, రామిరెడ్డి,కొండారెడ్డి, ఈశ్వర ప్రసాద్,రాజ్ కమల్, అంబేద్కర్, సాంబయ్య, సంపత్, ఇజ్జాడ తేజ, మరియు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *