Breaking News

పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త, రాజకీయవేత్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త, రాజకీయవేత్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 114 వ జయంతి సందర్భంగా స్థానిక రామవరప్పాడు రింగ్ సెంటర్ వద్ద మంగళవారం బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర సమర యోధుడు, గొప్పసంఘసంస్కర్త, రాజకీయవేత్త అని, భారత పార్లమెంటులో నలభై ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించారన్నారు. నాటి జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వం లో అతి చిన్న వయస్సులోనే మంత్రిపదవి గా బాధ్యతలు చేపట్టారన్నారు. దేశపు తొలి మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ అని 40 సంవత్సరాలకు పైగా వివిధ శాఖల క్యాబినెట్ మంత్రిగా పని చేశారన్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధం సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నారన్నారు. భారత దేశంలో హరిత విప్లవం వ్యవసాయం ఆధునిక రించటంలో జగజ్జీవన్ రామ్ అందించిన సహకారం మరువలేనిదన్నారు. నేడు ఆహారధాన్యాల ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధి సాధించడానికి కారణమయిందన్నారు. వరుసగా 30 సంవత్సరాల పాటు కేంద్ర శాసనసభ సభ్యులుగా ఉన్నారని,సుదీర్ఘకాలం క్యాబినెట్ మంత్రిగా పని చేశారన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.ఆయన అందించిన సేవలను గుర్తించుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె.మోహన్ కుమార్, ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ మేనేజర్ తాతినేని పద్మావతి,రామవరప్పాడు గ్రామ సర్పంచ్ వల్లి శ్రీదేవి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *