Breaking News

బాబూ జగ్జీవన్‌రామ్‌కు ఘనంగా నివాళి అర్పించిన గవర్నర్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా నివాళులర్పించారు. బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ బాబూ జగ్జీవన్‌రామ్ గొప్ప జాతీయ భావాలు కలిగిన నాయకుడని కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధునిగానే కాక సామాజిక న్యాయ పోరాట యోధునిగా అణగారిన వర్గాల కోసం పోరాడారన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ అద్భుతమైన పార్లమెంటేరియన్ అని, దేశ రాజకీయాల్లో అర్ధ శతాబ్దానికి పైగా పనిచేశారని, ముప్పై ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిబద్ధత, అంకితభావంతో పనిచేసిన నిజమైన ప్రజాస్వామ్యవాది అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో బాబు జగ్జీవన్ రామ్ చురుకైన పాత్ర పోషించారని, మహాత్మా గాంధీజీ స్ఫూర్తితో శాసనోల్లంఘన ఉద్యమం, సత్యాగ్రహంలో పాల్గొన్నారని గవర్నర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా, ఇతర అధికారులు, రాజ్‌భవన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *