విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ 114 వ జయంతి సందర్భంగా విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాతల్లో బాబూ జగ్జీవన్‌రామ్ ఒకరిని, అహింసా తత్వాన్ని పుణికి పుచ్చుకున్నారని, జాతీయోద్యమంలో గాంధీ స్ఫూర్తితో పాల్గొని, దేశ రాజ కీయాల్లో ఒక సరికొత్త నినాదంగా మారిన వ్యక్తినీ, బ్రిటిషర్స్ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకువస్తున్న సందర్భంలోనే ‘ఆల్ ఇండియా అణగారిన వర్గాల సమాఖ్య’ను ఏర్పాటు చేసి దళిత బహుజన వర్గాలను జాతీయ స్థాయిలో ఐక్యపరచే కార్యాచరణకై ఉద్యమించారాని, దేశ రక్షణ శాఖ మంత్రిగా ఆయన కార్యసాధన ఎప్పటికీ ఆదర్శనీయమనీ, దేశ ప్రజల చేత ‘బాబూజీ’ అన్న పిలుపు పొందిన గౌరవం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే దక్కిందనీ ఒకరు మహాత్మాగాంధీ కాగా, మరొకరు బాబూ జగ్జీవన్ గారు అని, నేటి రాజకీయ నాయకులు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని పరిపాలన కొనసాగించాలని మహేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో 52 వ డివిజన్ అధ్యక్షులు నల్లబెల్లి కనకారావు, 39 డివిజన్ అధ్యక్షులు ఏలూరు సాయి శరత్, శ్రీదేవి,మరుపిల్ల. చిన్నారావు మరియు పోలిశెట్టి .శివ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News