Breaking News

సామాజగతిని మార్చే ఛాయాచిత్రాలను మీడియా ప్రతిబింబించాలి

-ఫోటో జర్నలిస్టులతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక ఛాయా చిత్రం చెదరని జ్ఞాపకాలకు, మధుర స్మృతులకు అలవాలంగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రతి ఛాయా చిత్రం వెనుక ఓ అనుభూతి నిక్షిప్తమై ఉంటుందన్నారు. ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర స్దాయి పోటీలు నిర్వహించగా వాటిలో బహుమతులు గెలుచుకున్న 13 మందిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన ఫోటో జర్నలిస్టులతో గ్రూపు ఫోటో దిగి వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ మీడియా రంగంలో ఛాయా చిత్రానికి ఉన్న ప్రాధన్యత వెలకట్టలేనిదని, ఒక చిత్రం వేల ప్రశ్నలకు సమాధానం చెబుతుందని అన్నారు. సామాజగతిని మార్చే చిత్రాలు తీసి ప్రజలకు చేరవేయటంలో ఫోటో జర్నలిస్టులు ముందుండాలన్నారు. రాష్ట్ర స్ధాయి పోటీలలో అవార్డులు పొందిన విజయభాస్కర రావు, ప్రసాద్, నవాజ్ , ప్రసాద్ కాశీ, సైదేష్ , సుబ్రమణ్యం, మోహన క్రిష్ణ, సతీష్ , సింహాచలం, వినయ్ , మరిడయ్య, హుస్సేన్ , నాయిడులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు సాంబశివరావు, సీనియర్ ఫోటో గ్రాఫర్లు రూబెన్ బెసానియేల్, నారాయణ , దుర్గా ప్రసాద్, మహేష్ , రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *