Breaking News

పతక విజేతలకు శాప్ ఎండీ అభినందనలు…

అహ్మదాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు శాప్ ఎండీ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి అభినందనలు తెలిపారు. శుక్రవారం రోలర్ స్పోర్ట్స్ ఫ్రీ స్కేటింగ్ లో రజతం సాధించిన ఆకుల సాయి సంహితని, కాంస్య పతకం సాధించిన భూపతిరాజు అన్మిషా ని, శనివారం 100 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించిన జ్యోతి యర్రాజి ని, 400 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించిన జ్యోతిక శ్రీ ని, వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం సాధించిన కే. నీలం రాజుని, ఆదివారం వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన యస్. పల్లవిని శాప్ వీసీ & ఎండీ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ ప్రతిష్టను ఇనుమడింప చేసిన క్రీడాకారులకు ప్రభుత్వం, శాప్ తరుఫున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *