Breaking News

వి.ఆర్.ఓలపై వత్తిడి చెయ్యడం తగదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.హెచ్. రవీందర్ రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న షుమారు 15వేల మంది గ్రామ రెవిన్యూ అధికారులు తీవ్ర పనివత్తిడికి గురై ఈ మధ్యకాలంలో చాలామంది గుండెపోటుతో చనిపోవడం మరియు చాలామంది విధినిర్వహణలో యాక్సిడెంట్ల పాలవడం జరుగుతున్నాయి. సమయపాలన లేకుండా విధులు నిర్వహించాలని అధికారులు వత్తిడి చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం కొంతమంది అధికారులు తహసీల్దార్ల వైఖరికి నిరసనగా అన్నిజిల్లాల కలెక్టర్లకు ఆర్.డి.ఒలకు తహసీల్దార్లకు సమయపాలన ప్రకారం పనిచేస్తామని సెలవురోజులు, పండుగ దినాలలో పనిచేయలేమని అత్యవసర టైమ్ లో ఎప్పుడైనా పనిచేస్తామని అలాగే సర్వే విషయములో మ్యాన్ పవర్ లేకుండ టార్గెట్లు పెట్టి సర్వే చేయాలని తహసీల్దార్లు వత్తిడి చెయ్యడం మరియు సర్వేకు సంబంధించి వి.ఆర్.ఓలను పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చెయ్యడంపై కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాగే అధికారుల వైఖరి కోనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవిన్యూ అధికారులందరూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలియజేస్తున్నాము అన్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రేట్ టు విఆర్వోలకు సర్వే పరీక్ష నిర్వహిస్తూ ప్రభుత్వం షెడ్యూల్ డేటు విడుదల చేసిందని అందరూ సంతోషించేలోగా నేను కూడా ఉద్యోగ భవిష్యత్తు కోరుకునే నాయకుడినే అని చెప్పుకు తిరిగే “బొప్ప రాజు వెంకటేశ్వరరావు” ఉద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటూ ప్రభుత్వం ఖరారు చేసిన డేటుని రెవెన్యూ స్పోర్ట్స్ లో పాల్గొంటున్నారు ఉద్యోగులు అని డేట్ పోస్ట్ ఫోన్ చేయమని ప్రభుత్వానికి లేక పంపటం అత్యంత బాధాకరమని తీవ్ర పని ఒత్తిడితో ఒకపక్క గ్రేట్ టు విఆర్వోలు ఉంటే స్పోర్ట్స్ లో పాల్గొనే వ్యక్తులు లేరు, వేరే వారు తక్కువ మంది మాత్రమే పాల్గొనడం జరుగుతుంది ఈ రకంగా గొప్ప రాజు ప్రవర్తించటం బాధాకరమని ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరపున ఎన్నో మెమోరాండాలు వివరంగా ప్రభుత్వానికి అధికారులకు ఇవ్వటం ద్వారా ఇప్పటికీ ఈ పరీక్ష ద్వారా అవకాశం వచ్చిందని సంతోషంతో అందరూ ఉంటే, స్పోర్ట్స్ అడ్డుపెట్టి షెడ్యూల్ మార్చమండటం కరెక్ట్ కాదని దుయ్యబట్టారు.

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వాసా దివాకర్ మాట్లాడుతూ సర్వే విషయములో ముఖ్యమంత్రి పారదర్శకంగా పనిచెయ్యాలని ఎక్కడా తప్పులు చెయ్యకూడదని చెపుతుంటే కొంతమంది అధికారులు కావాలని సమయపాలన లేకుండా రాత్రి, పగలు పనిచేయించడం వలన తప్పులు జరిగితే దానిపై కూడా గ్రామ రెవిన్యూ అధికారులను బాధ్యులను చెయ్యడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం తీవ్రంగా ఖండింస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాటకొండ శ్రీనివాస్, అర్జున్ రావు తదితరులు, పలువురు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై సీఎం సానుకూలం : మంత్రి నారాయణ

-సీఆర్‌డీఏ కమిషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శితో వెంటనే మాట్లాడుతా : నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *