Breaking News

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా చేపట్టాలి !!

-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ధాన్య సేకరణ కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో వివిధ శాఖల అధికారులతో ధాన్య సేకరణ పురోగతి పై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 200 కు పైగా కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించి, అన్ని కేంద్రాలను ప్రారంభించామన్నారు. ధాన్యం సేకరణలో ముందుగానే గోనె సంచులు సిద్ధం చేయాలని వాటిని కేంద్రాలకు పంపిణీ చేసి, కొనుగోలు కేంద్రాలలో తేమ పరీక్ష, తూకం, తూర్పారబట్టే పరికరం, టార్పాలిన్, సిబ్బంది కావాల్సినవి అన్ని అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పట్టా పాస్ బుక్ లేని రైతుల జాబితా తయారు చేసి, ముందస్తుగా ధ్రువీకరణలు అందజేయాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరణలో భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉన్నట్లు ఆయన తెలిపారు. రవాణా, కూలీ ఖర్చుల రీయింబర్స్ లో జవాబుదారీతనం ఉండాలని అన్నారు. రైతులకు మేలు చేసేలా ఈ విధానాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. రవాణా, సంచుల ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుందని రైతులకు చెప్పాలని తెలిపారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, , ఎఫ్సిఐ మేనేజర్ శ్రీధర్, డిఆర్డీఓ సీతాపతి రావు, జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్ రావు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *